Shaktimaan : శక్తిమాన్ మళ్ళీ వస్తున్నాడు..

90 వ దశకంలో చాలా మందికి ఇష్టమైన టీవీ సీరియల్స్ లో ఒకటి శక్తిమాన్. హిందీలో DD నేషనల్ లో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ రీజనల్ భాషల్లో కూడా డబ్బింగ్ అయి టెలికాస్ట్ అయింది. DD నేషనల్ లో...

Shaktimaan :  శక్తిమాన్ మళ్ళీ వస్తున్నాడు..

Shaktimaan

Shaktimaan :  ఒకప్పటి హిందీ టీవీ సీరియల్ ‘శక్తిమాన్’ ఇప్పుడు సినిమాగా రాబోతుంది. 90వ దశకంలో చాలా మందికి ఇష్టమైన టీవీ సీరియల్స్ లో ఒకటి శక్తిమాన్. హిందీలో DD నేషనల్ లో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ రీజనల్ భాషల్లో కూడా డబ్బింగ్ అయి టెలికాస్ట్ అయింది. DD నేషనల్ లో 1997 నుంచి 2005 వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది. అప్పట్లో శక్తిమాన్ సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇండియా ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ గా శక్తిమాన్ పేరు తెచ్చుకుంది.

అప్పటి పిల్లలకి ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. అప్పట్లో శక్తిమాన్ ఫోటోని వాడుకొని చాలా వస్తువులు, కంపెనీలు కూడా ప్రమోషన్ చేశాయి అంటే శక్తిమాన్ ఎంత పాపులర్ అర్ధం చేసుకోవచ్చు. అప్పటి శక్తిమాన్ క్యారెక్టర్ ని నటుడు, నిర్మాత ముఖేష్ ఖన్నా చేశారు. సూపర్ హీరోగా అన్ని ఫీట్స్ చేస్తూ ప్రజలని కాపాడుతూ తెరకెక్కిన శక్తిమాన్ ప్రేక్షకులని అలరించింది.

Dimple Hayathi : ఒక్కపాట కోసం ఆరు కిలోల బరువు తగ్గిన హీరోయిన్

తాజాగా శక్తిమాన్ క్యారెక్టర్ మళ్ళీ రాబోతుంది. అయితే ఈ సారి సినిమా రూపంలో మరింత కొత్తగా రాబోతుంది. సోని పిక్చర్ ఆధ్వర్యంలో మరో రెండు సంస్థలు కలిసి ‘శక్తిమాన్’ సినిమాని నిర్మిస్తున్నాయి. అప్పటి శక్తిమాన్ క్యారెక్టర్ ముఖేష్ ఖన్నా కూడా ఈ సినిమాలో భాగమవ్వనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ అనౌన్సమెంట్ చేశారు. టైటిల్ అనౌన్సమెంట్ వీడియోని విడుదల చేశారు.

Chiranjeevi : ఎవరేమన్నా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే..

టైటిల్ రివీల్ తప్ప మరే డీటెయిల్స్ చెప్పలేదు. ఇందులో ఈ సారి శక్తిమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో తెలపలేదు. దీంతో ఈ సారి శక్తిమాన్ ఎవరు చేస్తారా అని అంతా ఆలోచిస్తున్నారు. ఇక అప్పటి శక్తిమాన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.