Sharwanand : మీ ఆస్తుల లిస్ట్ అంతా మా దగ్గర స్కాన్ కాపీలు ఉన్నాయి.. బాలయ్యకి కౌంటర్ ఇచ్చిన శర్వానంద్..

ఈ ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ శర్వానంద్ బిజినెస్ గురించి మాట్లాడారు. ఇక్కడ సినిమాల్లో సంపాదిస్తున్న డబ్బులన్నీ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో పెడుతున్నావా అని అడగడంతో శర్వా............

Sharwanand : మీ ఆస్తుల లిస్ట్ అంతా మా దగ్గర స్కాన్ కాపీలు ఉన్నాయి.. బాలయ్యకి కౌంటర్ ఇచ్చిన శర్వానంద్..

Sharwanand counter to balakrishna in Unstoppable show

Sharwanand :  బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగింది. ఈ ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ శర్వానంద్ బిజినెస్ గురించి మాట్లాడారు. ఇక్కడ సినిమాల్లో సంపాదిస్తున్న డబ్బులన్నీ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో పెడుతున్నావా అని అడగడంతో శర్వా.. సర్, అవన్నీ మా నాన్నవి, అన్నయ్యవి. అసలు వాటితో నాకు సంబంధం లేదు అన్నారు. నాకు చెప్పకు, నాకు అన్ని తెలుసు నీ ఆస్తుల గురించి అని సరదాగా అన్నారు బాలయ్య.

Balakrishna : ఆదిత్య 999 మ్యాక్స్ కథ రాసేశాను.. త్వరలోనే చేయబోతున్నాను

దీంతో శర్వానంద్ కూడా సరదాగా.. నాకు కూడా మీ ఆస్తుల చిట్టా మొత్తం తెలుసు. మీరు మర్చిపోయారు అనుకుంట మీ నాన్న గారి దగ్గర మా తాతయ్య చార్టెడ్ అకౌంటెంట్. మీ ఆస్తుల లిస్ట్ అన్ని స్కాన్ కాపీలు ఉన్నాయి మా దగ్గర, నేను కూడా మీ ఆస్తుల లిస్ట్ బయటపెడతా అని అన్నాడు.