Shiva Nirvana: ఇంకెన్నాళ్లు అంటూ డైలామాలో శివ నిర్వాణ..?

టాలీవుడ్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న తాజా మూవీ ‘ఖుషి’ ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, సామ్ అనారోగ్యం కారణంగా ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే ఆలోచనలో పడ్డాడట దర్శకుడు.

Shiva Nirvana: ఇంకెన్నాళ్లు అంటూ డైలామాలో శివ నిర్వాణ..?

Shiva Nirvana: టాలీవుడ్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న తాజా మూవీ ‘ఖుషి’ ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, సామ్ అనారోగ్యం కారణంగా ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే ఆలోచనలో పడ్డాడట దర్శకుడు.

Khushi : అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన సమంత, విజయ్.. గ్రూప్ ఫొటోలతో హడావిడి..

ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ, ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో, వచ్చే ఏడాది ప్రారంభంలోనైనా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ, సామ్ ప్రస్తుతం అనారోగ్యానికి గురికావడంతో, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పటికి రిలీజ్ చేస్తామో అనే ఆలోచనలో పడ్డాడట డైరెక్టర్. వేరే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో శివ నిర్వాణ తీవ్ర నిరాశకు లోనవుతున్నాడట.

Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. మూవీ యూనిట్ క్లారిటీ

ఖుషి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు ఈ డైరెక్టర్. ఆయన తెరకెక్కించిన లాస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో, ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని చూస్తున్నాడు. మరి శివ నిర్వాణ ఈ సినిమాను పూర్తి చేసే సమయం ఎప్పుడు వస్తుందా అని ఆశగా చూస్తున్నాడట.