Shivathmika : పారిపోయింది నేనా? మా అక్కా??.. ఫేక్ న్యూస్ పై ఫైర్ అయిన శివాత్మిక..

శివాత్మిక ఈ ఫేక్ న్యూస్ పై ఫైర్ అయింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఓ ఫొటోను షేర్‌ చేసింది శివాత్మిక. ఆ ఫోటోని షేర్ చేసి..........

Shivathmika : పారిపోయింది నేనా? మా అక్కా??.. ఫేక్ న్యూస్ పై ఫైర్ అయిన శివాత్మిక..

Shivathmika

Shivathmika :  ఇటీవల ఫేక్ న్యూస్ బాగా హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తున్నాయి. సెలబ్రిటీల విషయంలో ఇది మరింత ఎక్కువగా జరుగుతుంది. ఇటీవల సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక దుబాయ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. దుబాయ్ లో ఎంజాయ్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో కూడా పెడుతుంది. అయితే కొంతమంది రాజశేఖర్‌ కూతురు ప్రియుడితో వెళ్ళిపోయింది అంటూ వార్తలు రాశారు.

BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఇద్దరు అవుట్..

ఈ వార్తలు శివాత్మిక వరకు వెళ్లాయి. దీంతో శివాత్మిక ఈ ఫేక్ న్యూస్ పై ఫైర్ అయింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఓ ఫొటోను షేర్‌ చేసింది శివాత్మిక. ఆ ఫోటోని షేర్ చేసి.. ”నేను దుబాయ్ వెళ్ళింది వీళ్ళతోటి. మరి మీరు చెప్తున్న బాయ్ ఫ్రెండ్ ఎవరు? బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది నేనా? శివానినా? ఇదంతా నెక్స్ట్‌ లెవల్‌ న్యూస్‌ రాస్తున్నారు. నాన్ సెన్స్ న్యూస్ రాస్తున్నారు మా ఇద్దరి మీద. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసేటప్పుడు క్లారిటీగా అయినా రాయండి. ఇంతకీ బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది నేనా? లేదా మా అక్కనా? కరెక్ట్‌గా చెప్పండి’ అంటూ సెటైరికల్ గా ఫేక్ న్యూస్ రాసేవారిపై ఫైర్‌ అయింది. దీంతో ఆ ఫేక్ న్యూస్ లకు ఫుల్ స్టాప్ పడింది.