Shoaib Aktar: అఫ్ఘాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడితే.. పాక్ ఫ్యాన్స్ ఊరుకోరు..!

టీ20 ప్రపంచ కప్ లో ఇవాళ కీలక మ్యాచ్ జరగబోతోంది. భారత జట్టు ఆ మ్యాచ్ లో లేకున్నా.. మన దేశ క్రికెట్ ఫ్యాన్స్ కళ్లన్నీ ఆ ఆటపైనే ఉన్నాయి.

Shoaib Aktar: అఫ్ఘాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడితే.. పాక్ ఫ్యాన్స్ ఊరుకోరు..!

Pak

Shoaib Aktar: టీ20 ప్రపంచ కప్ లో ఇవాళ కీలక మ్యాచ్ జరగబోతోంది. భారత జట్టు ఆ మ్యాచ్ లో లేకున్నా.. మన దేశ క్రికెట్ ఫ్యాన్స్ కళ్లన్నీ ఆ ఆటపైనే ఉన్నాయి. న్యూజిలాండ్ – అఫ్ఘానిస్థాన్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ లో.. న్యూజిలాండ్ ఓడితేనే మన దేశ జట్టుకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే అఫ్ఘాన్ పై టీమిండియా ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకుంటున్నారు. పేరుకు చిన్న జట్టే అయినా.. అఫ్ఘాన్ సంచలనం సృష్టించకపోతుందా అని ఆశపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. కివీస్, అఫ్ఘాన్ మ్యాచ్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన కామెంట్లు చేశాడు. కివీస్ గనక ఓడిపోతే.. పాకిస్తానీలు ఊరుకునే అవకాశం లేదని అన్నాడు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేసే అవకాశం ఉంటుందని ఇన్ డైరెక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం భద్రతా పరమైన కారణాలతో.. పాకిస్థాన్ లో సిరీస్ ను న్యూజిలాండ్ సడన్ గా రద్దు చేసుకున్న విషయాన్ని పాకిస్తానీలు ఇంతా మరిచి పోలేదని తన చానల్ లో అక్తర్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్లతో పాకిస్థాన్ లో ప్రస్తుతం ఉన్న క్రికెట్ ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో.. అక్తర్ చెప్పేశాడు.

అయితే.. ఇదే షోయబ్ అక్తర్.. 3 రోజుల క్రితం మరో కామెంట్ చేశాడు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని ఉందన్నాడు. ఇప్పుడు.. పాకిస్థాన్ అభిమానులు కోరుకుంటున్నట్టు న్యూజిలాండ్.. అఫ్గాన్ పై గెలిస్తే ఆ అవకాశం ఉండదు కదా.. అని కొందరు అక్తర్ మాటలకు కౌంటర్ ఇస్తున్నారు. అఫ్ఘాన్ గెలిచి.. న్యూజిలాండ్ ఓడితే పాకిస్తానీలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని కోరుకునేవాళ్లు కూడా ఉన్నారు.

టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ పై వరస పరాజయాలతో సెమీస్ ఆశలు దాదాపుగా పోగొట్టుకున్న భారత జట్టు.. తర్వాత ఫామ్ లోకి వచ్చింది. అఫ్ఘానిస్తాన్, స్కాట్లాండ్ జట్లపై భారీ విజయాలను అందుకుంది. సెమీ ఫైనల్స్ లో చోటు మీద ఇంకా చివరి ఆశలు మిగుల్చుకుంది. ఈ క్రమంలో.. భారత క్రికెట్ అభిమానులు ఆశించినట్టు ఆఫ్ఘన్ గెలుస్తుందా.. అక్తర్ చెప్పినట్టుగా పాక్ అభిమానులు కోరుకున్నట్టుగా కివీస్ గెలుస్తుందా.. అన్నది ఉత్కంఠను పెంచుతోంది. గ్రూప్ లో ఇప్పటికే పాకిస్తాన్ జట్టు సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకోగా.. ఇవాల్టి మ్యాచ్ తో రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందన్న విషయంపై ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read More:

T20 World Cup 2021 : స్కాట్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ.. రన్‌రేట్ మరింత మెరుగు

T20 World Cup 2021 ఎట్టకేలకు భారత్ బోణీ.. అప్ఘానిస్తాన్ పై ఘన విజయం

T20 World Cup 2021: ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్తాన్ మ్యాచ్ లో ఎన్ని అద్భుతాలో తెలుసా..

T20 World Cup 2021 : స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ విజయం

T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు వరుసగా నాలుగో విజయం