T20 World Cup 2021: ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్తాన్ మ్యాచ్ లో ఎన్ని అద్భుతాలో తెలుసా..

సెమీస్ కు చేరే ఆశలను తట్టిలేపింది టీమిండియా. ఇదిలా ఉంటే ఇరు జట్లు మ్యాచ్ లో చూపించిన సత్తాతో ప్రత్యేక ఘనత నమోదు చేశారు.

T20 World Cup 2021: ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్తాన్ మ్యాచ్ లో ఎన్ని అద్భుతాలో తెలుసా..

Ind Afg

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా అద్భుతమైన విజయంతో బోణీ కొట్టింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో 10వికెట్లు, 8వికెట్ల తేడాతో పరాజయానికి గురైనప్పటికీ అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 66పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. గత మ్యాచ్ లకు మాదిరిగానే టాస్ ఓడినప్పటికీ ప్రత్యర్థులకు భారీ టార్గెట్ 211 ముందుంచి ఒత్తిడికి గురి చేసి గెలిచేసింది.

మరోసారి సెమీస్ కు చేరే ఆశలను తట్టిలేపింది టీమిండియా. ఇదిలా ఉంటే ఇరు జట్లు మ్యాచ్ లో చూపించిన సత్తాతో ప్రత్యేక ఘనత నమోదు చేశారు.

టీ20 వరల్డ్ కప్ 2021లో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన అఫ్ఘానిస్తాన్
55/1 vs Sco
49/4 vs Pak
50/0 vs Nam
47/2 vs Ind
ప్రస్తుత టోర్నీలో సూపర్ 12 గ్రూపులో ఉన్న జట్లలో అఫ్ఘాన్ కంటే వేగంగా పవర్ ప్లేలో ఎవరూ స్కోరు నమోదు చేయలేకపోయారు.

T20 World Cup 2021 అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా టీమిండియా
210/2* Ind v Afg Abu Dhabi
190/4 Afg v Sco Sharjah
189/2 Pak v Nam Abu Dhabi
181/7 Ban v PNG Al Amerat

ఇదే వేదికపై టీమిండియా రెండోసారి అధిక స్కోరు నమోదు చేసింది. అఫ్ఘానిస్తాన్ పై చేసిన 210 స్కోరు కంటే ముందు ఐర్లాండ్ పై 2013లో 225పరుగులు చేసింది.

టీ20 వరల్డ్ కప్ లలో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనర్లు

140 Rohit – Rahul v Afg Abu Dhabi 2021
136 Sehwag – Gambhir v Eng Durban 2007
106 Rohit – Kohli v WI Mirpur 2014
100 Rohit – Kohli v Ban Mirpur 2014