Lightening Strike : షాకింగ్ వీడియో.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పిడుగు, అక్కడికక్కడే మృతి

Lightening Strike : బొగ్గుగనిలో పని చేసే కార్మికుడు పని ప్రదేశం నుంచి నచుడుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఘోరం జరిగిపోయింది.

Lightening Strike : షాకింగ్ వీడియో.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పిడుగు, అక్కడికక్కడే మృతి

Lightening Strike(Photo : Google)

Updated On : April 27, 2023 / 9:53 PM IST

Lightening Strike : వర్షం పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెబుతారు. బయట ఉండొద్దని, చెట్ల కింద అసలే ఉండొద్దని హెచ్చరిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిడుగులు ఎప్పుడు ఎక్కడ పడతాయో ఎవరికీ తెలియదు. అందుకే, కేర్ ఫుల్ గా ఉండాలి. పిడుగుపాటు ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై పిడుగు పడి అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

చంద్రపూర్ జిల్లా భద్రావతి తాలూకా మజ్రీ ప్రాంతంలోని వెస్ట్రన్ బొగ్గుగనిలో పని చేసే కార్మికుడు పని ప్రదేశం నుంచి నచుడుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. ఆకాశం నుంచి ప్రకాశవంతమైన మెరుపు అతడిపై పడింది. అంతే.. పిడుగు ధాటికి ఆ కార్మికుడు స్పాట్ లోనే కుప్పకూలాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వ్యక్తిపై నేరుగా పిడుగు పడిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు.

Also Read..Visakha Swetha Case : విశాఖ బీచ్‌లో మృతదేహం కలకలం.. శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అసలేం జరిగింది?

మృతుడిని బీహార్ కు చెందిన బాబుధన్ యాదవ్ గా గుర్తించారు. అదో పెద్ద మైదానం లాంటి ప్రాంతం. అతడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో పిడుగు అటు దిశగా ఆకర్షించి వ్యక్తిపై పడింది. సాధారణంగా చెట్లు, టవర్లు, లోహంపు వస్తువులను పిడుగు ఆకర్షిస్తుంది. పిడుగు అంటే కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహం అని చెప్పొచ్చు. ఒక్కసారిగా భూమి వైపు అట్రాక్ట్ చేయబడుతుంది. పిడుగు పడిన ప్రాంతం పూర్తిగా దగ్ధమైపోతుంది. కాగా, వ్యక్తి మీద నేరుగా పిడుగు పడిన ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందుకే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని ముందే తెలిస్తే.. బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది.