IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సమయంలో వర్షం పడటానికి హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ కారణమా? వైరల్ పోస్టుకు స్పందించిన నటి

శ్రద్ధ కపూర్ తన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వర్షం సాంగ్స్ లో నటించింది.

IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ సమయంలో వర్షం పడటానికి హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ కారణమా? వైరల్ పోస్టుకు స్పందించిన నటి

Shraddha Kapoor

Updated On : May 29, 2023 / 1:24 PM IST

IPL 2023 Final – CSK vs GT: ఇండియన్ ప్రిమియర్ లీగ్‌ (IPL)లో గతంలో ఎదురవని పరిస్థితి ప్రస్తుత సీజన్‌లో ఎదురైంది. 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అహ్మదాబాద్‌ (Ahmedabad) లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ వాయిదాపడింది. భారీ వర్షం కారణంగా మైదానంలో నీరు నిలవడంతో మ్యాచ్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో రిజర్వ్ డే సోమవారంకు వాయిదా వేశారు. సోమవారం సాయంత్రం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

IPL 2023 Final: ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఈరోజు కూడా వర్షం కురిస్తే విజేతలను ఎలా నిర్ణయిస్తారో తెలుసా?

ఆదివారం ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకు గంట ముందునుంచే జల్లులు మొదలయ్యాయి. క్రమంగా అవి పెరుగుతూ భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడటంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఓ నెటిజన్ మ్యాచ్ సమయంలో వర్షం పడటానికి శ్రద్ధా కపూర్ కారణమని చెప్పాడు. అదెలాఅంటే.. 2023 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అధికారిక డిజిటల్ బ్రాడ్ కాస్టర్ జియోసినిమా ఫ్యానెల్‌లో శ్రద్దా కపూర్ పాల్గొంది. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఉండటం వల్లే వర్షం వచ్చిందని నెటిజన్లు పేర్కొన్నాడు.

 

shradha kapoor

shradha kapoor

శ్రద్ధ కపూర్ తన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చామ్ చామ్‌ వంటి మూడు వర్షపు పాటల్లో నటించిందని నెటిజన్ తెలిపాడు. అయితే, నెటిజన్ల పోస్టులకు శ్రద్ధా కపూర్ స్పందించింది. తన అధికారిక ఇన్ స్టాగ్రామ్‌ స్టోరీలో అభిమానుల వ్యాఖ్యలను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె పలు రకాల ఎంవోజీలు పెట్టి నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశారు.