Shree Rapaka : ప్రభాస్ పెళ్లయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను అంటున్న ఆర్జీవీ భామ

గ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక శ్రీ రాపాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూలలో ప్రభాస్ గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యూలో శ్రీ రాపాక ప్రభాస్ గురించి మాట్లాడుతూ......

Shree Rapaka : ప్రభాస్ పెళ్లయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను అంటున్న ఆర్జీవీ భామ

Prabhas

Shree Rapaka :  ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక అమ్మాయిల్లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ గురించి అందరి మనస్సులో ఉన్న ప్రశ్న ఒక్కటే, ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని. ప్రభాస్ ఒప్పుకోవాలి కానీ అతన్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. తాజాగా ఓ నటీమణి ప్రభాస్ పెళ్లి అయితే గాని నేను పెళ్లి చేసుకోను అని చెప్తుంది.

టాలీవుడ్‌లో పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేసిన శ్రీ రాపాక ఆర్జీవీ నగ్నం షార్ట్ ఫిలింతో హీరోయిన్‌గా మారింది. ఆర్జీవీ శ్రీ రాపాకని నటిగా మార్చేశాడు. దీంతో శ్రీ రాపాకకి చాలా అవకాశాలు వచ్చాయి. తక్కువ టైంలోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ భామ. ఇక ఇటీవల బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లో కూడా పార్టిసిపేట్ చేసి తక్కువ టైంలోనే బయటకి వచ్చేసింది. బిగ్‌బాస్ తర్వాత తన క్రేజ్ మరింత పెరగడంతో మరి కొన్ని అవకాశాలు శ్రీ రాపాకకి వస్తున్నాయి.

Ananya Panday : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన ‘లైగర్’ భామ

 

ఇక బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక శ్రీ రాపాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూలలో ప్రభాస్ గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యూలో శ్రీ రాపాక ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ”ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రభాస్ నా క్రష్. ప్రభాస్ కనిపిస్తే అలానే చూస్తూ ఉండిపోతా. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. ప్రభాస్ పెళ్లి అయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను” అని తెలిపింది. మరి ఈ ఆర్జీవీ బోల్డ్ బ్యూటీకి ప్రభాస్ సినిమాల్లో భవిష్యత్తులో అయినా సినిమా ఛాన్స్ వస్తుందేమో చూడాలి.