Srikanth Tyagi: నోయిడా టు మీరట్.. పోలీసులకు చిక్కకుండా 15 సార్లు కార్లు మార్చిన శ్రీకాంత్ త్యాగి

నేను అలాంటి భాష ఉపయోగించినందుకు చాలా చింతిస్తున్నాను. వాస్తవానికి అలా మాట్లాడి ఉండకూడదు. ఆమెకు నాకు సోదరి లాంటిది. మన సమాజంలో మహిళకు గౌరవం ఉంటుంది. కాబట్టి నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇంకెప్పుడూ ఎవరితో ఇలా ప్రవర్తించను

Srikanth Tyagi: నోయిడా టు మీరట్.. పోలీసులకు చిక్కకుండా 15 సార్లు కార్లు మార్చిన శ్రీకాంత్ త్యాగి

Shrikant Tyagi changed cars 15 times from noida to meerut

Updated On : August 21, 2022 / 5:39 PM IST

Srikanth Tyagi: మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆమెపై దాడికి పాల్పడ్డ బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన శ్రీకాంగ్ త్యాగీ తప్పించుకుని మీరట్ పారిపోయారు. అనంతరం అతడిని అక్కడే పట్టుకుని నోయిడాకు తీసుకువచ్చారు. అయితే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నోయిడా నుంచి మీరట్ వరకు శ్రీకాంత్ త్యాగి 15 సార్లు కార్లు మార్చి ప్రయాణం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీని వల్లే అతడిని పోలీసులు తొందరగా గుర్తు పట్టలేకపోయారని అంటున్నారు. అయితే మీరట్‭లో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకుని అరెస్ట్ చేశారు.

కాగా, తాను దుర్భషలాడిన మహిళకు శ్రీకాంత్ త్యాగి క్షమాపణలు చెప్పాడు. ఆమె తనకు సోదరిలాంటిదని, క్షమించాలని వేడుకున్నారు. ‘‘నేను అలాంటి భాష ఉపయోగించినందుకు చాలా చింతిస్తున్నాను. వాస్తవానికి అలా మాట్లాడి ఉండకూడదు. ఆమెకు నాకు సోదరి లాంటిది. మన సమాజంలో మహిళకు గౌరవం ఉంటుంది. కాబట్టి నేను చేసింది చాలా పెద్ద తప్పు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇంకెప్పుడూ ఎవరితో ఇలా ప్రవర్తించను’’ అని త్యాగి బుధవారం అన్నారు. సోమవారం త్యాగి నివాసంలోని అక్రమ కట్టడాల్ని నోయిడా అడ్మినిస్ట్రేషన్ బుల్డోజర్లతో కూల్చివేసింది. నోయిడాలోని గ్రాండ్ ఒమాక్సె సొసైటీలోని సెక్టార్-93బీకి పోలీసులతో పాటు అధికారులు చేరుకుని ఈ తతంగాన్ని పూర్తి చేశారు.

కొద్ది రోజుల క్రితం గ్రాండ్ ఒమాక్సె సొసైటీలో మహిళకు, త్యాగికి మధ్య గొడవ జరిగింది. త్యాగి మొక్కలను నాటాలనుకోగా నిబంధనలు ఉల్లంఘించారంటూ మహిళ వ్యతిరేకించింది. త్యాగి అలా చేయడానికి తనకు హక్కు ఉందని వాదించడంతో గొడవ పెద్దదైంది. మహిళపై దుర్భాషలాడటం, దాడి చేయడం వంటివి చేశారు. త్యాగిపై గతంలో కూడా కేసులు ఉన్నాయట. 2007 నుంచి ఆయనపై అదే మహిళ తొమ్మిది కేసులు పెట్టినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. బెదిరింపులు, నేరపూరిత చర్యలు, అల్లర్లు, హింస వంటి చర్యల కింద ఈ కేసులు నమోదు అయ్యాయి. 2020లో త్యాగిపై హత్యాయత్నం, క్రమినల్ కేసులు నమోదైంది. తాజా కేసులో రెండు ఎఫ్ఐఆర్‭లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Nupur sharma gets relief by SC: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కేసులో నుపుర్ శర్మకు ఊరట