Revanth : తండ్రైన సింగర్ రేవంత్.. కానీ పాపని చూడలేకపోతున్నాడు..

సింగర్ రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్నాడు. రేవంత్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అన్వితని వివాహం చేసుకున్నాడు. అతను బిగ్ బాస్ లోకి వచ్చేటప్పుడు అన్విత ప్రెగ్నెంట్ గా ఉంది. అయినా కూడా.................

Revanth : తండ్రైన సింగర్ రేవంత్.. కానీ పాపని చూడలేకపోతున్నాడు..

singer revanth become father

Revanth :  సింగర్ రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్నాడు. రేవంత్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అన్వితని వివాహం చేసుకున్నాడు. అతను బిగ్ బాస్ లోకి వచ్చేటప్పుడు అన్విత ప్రెగ్నెంట్ గా ఉంది. అయినా కూడా రేవంత్ బిగ్ బాస్ కి వచ్చి ఆడుతున్నాడు. ఇటీవలే అన్వితకి శ్రీమంతం చేయగా ఆ వీడియోని బిగ్ బాస్ లో కూడా ప్లే చేశారు. దీంతో రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

ఇటీవల బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు రేవంత్ కి అన్వితతో వీడియో కాల్ అరేంజ్ చేశారు. ఈ వీడియో కాల్ లో తనకి డెలివరీ డేట్ ఇచ్చారని అన్విత చెప్పింది. తాజాగా అన్విత డిసెంబర్ 1న పండంటి పాపకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా అన్విత, రేవంత్ సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేశారు.

Hanuman : హనుమాన్ సినిమాకి వీఎఫ్ఎక్స్ చేసింది హాలీవుడ్ లో కాదు.. హైదరాబాద్ లోనే ఏ కంపెనీనో తెలుసా??

అయితే రేవంత్ బిగ్ బాస్ లో ఉండటంతో తన పాపని చూడలేకపోతున్నాడు. ఇప్పటికి రేవంత్ కి ఈ విషయం తెలీదు. మరి బిగ్ బాస్ ఈ విషయం రేవంత్ కి ఎప్పుడు చెప్తాడు, చెప్తే రేవంత్ ఎలా ఫీల్ అవుతాడు, మళ్ళీ కాల్ లాంటిది ఏమన్నా అరేంజ్ చేస్తాడా చూడాలి. ఇక అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు.