Bigg Boss 5 : చీకట్లో సిరి, షన్ను రొమాన్స్.. షాకైన సన్నీ

దీంతో సిరి పేపర్ మడతపెట్టి పక్కనపెట్టేసింది. వెంటనే తన బెడ్ దిగి షణ్ముఖ్ బెడ్ ఎక్కేసింది. షణ్ముఖ్ వొళ్ళో సిరి పడుకొని గట్టిగా హగ్ చేసుకుంది. వీరిద్దరూ చీక‌ట్లో.........

Bigg Boss 5 : చీకట్లో సిరి, షన్ను రొమాన్స్.. షాకైన సన్నీ

Shannu Siri

Bigg Boss 5 :  మొన్నటి దాకా ఈ సీజన్ బిగ్ బాస్ లో మానస్, ప్రియాంకలది లవ్ ట్రాక్ అని అనుకున్నారు అంతా. కానీ కొద్ది రోజులుగా సిరి, షన్నులది లవ్ ట్రాక్ లా అనిపిస్తుంది. వీళ్లిద్దరు బయటకి ఫ్రెండ్స్ అని చెప్పినా వీళ్ళు చేసే పనులు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. గత వారం నుంచి వీళ్లిద్దరు గొడవ పడుతున్నారు, కలిసిపోతున్నారు. ఈ టైములో హగ్స్, కిస్సులు, ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చోవడం చేస్తున్నారు. నాగార్జున సిరి, ష‌ణ్ముఖ్‌ల‌ని పిలిచి మారాలి అని చెప్పినా ఏం మారలేదు అని తెలుస్తుంది.

Akhanda: ‘అఖండ’ కోసం 120 మంది సింగర్స్… 500 మంది మ్యుజిషియన్స్.. తమన్ ప్లాన్ మాములుగా లేదుగా

మొన్న రాత్రి జరిగిన సీన్ ని నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు. పక్క బెడ్‌పై షణ్ముఖ్ ఉండగా సిరి తన బెడ్‌పై పడుకుంటూ ఐ యామ్ ఇండివిడ్యువల్ అని పేపర్‌పై రాసి అది షణ్ముఖ్ చూసే విధంగా తన బెడ్‌కి అంటించింది. అది షణ్ముఖ్ చూసి అలా పెట్టి నిన్ను నువ్వు జోక్ చేసుకోవద్దు. జనం నీ గురించి మాట్లాడుకోవాలనే అలా పెట్టావ్ నువ్వు, మనిద్దరి సీన్‌ని అందరికీ చూపిస్తున్నావ్, దీన్నే ఆపుకోమని చెప్తున్నా, ఇంకొకరు మన గురించి మాట్లాడుకునే అవకాశాన్ని నువ్వే ఇస్తున్నావ్, నీకు ఏదైనా చెప్పాలని ఉంటే నాతో చెప్పు డైరెక్ట్‌గా ఐ యామ్ ఇండివిడ్యువల్ అని రాసేంత పెద్ద గొడవ అవ్వలేదు మనిద్దరికి అని అన్నాడు.

Brahmanandam : మీమ్స్ చేసే వాళ్లందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా : బ్రహ్మానందం

దీంతో సిరి పేపర్ మడతపెట్టి పక్కనపెట్టేసింది. వెంటనే తన బెడ్ దిగి షణ్ముఖ్ బెడ్ ఎక్కేసింది. షణ్ముఖ్ వొళ్ళో సిరి పడుకొని గట్టిగా హగ్ చేసుకుంది. వీరిద్దరూ చీక‌ట్లో రొమాన్స్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇది చూసిన సన్నీ షాకయ్యి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మరి వీళ్ళ ప్రేమ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. ఈ రొమాన్స్ వీళ్ళు కావాలనే చేశారా? బిగ్ బాస్ రేటింగ్ కోసం చేయించాడా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.