Indian nationals: భారతీయుల అక్రమ రవాణా… పట్టుకున్న యూఎస్ అధికారులు

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు భారతీయులుసహా ఏడుగురిని అమెరికన్ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా-కెనడా సరిహద్దులో గత నెల 28న ఈ ఘటన జరిగింది.

Indian nationals: భారతీయుల అక్రమ రవాణా… పట్టుకున్న యూఎస్ అధికారులు

Indian Nationals

Indian nationals: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు భారతీయులుసహా ఏడుగురిని అమెరికన్ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా-కెనడా సరిహద్దులో గత నెల 28న ఈ ఘటన జరిగింది. ఇది మానవ అక్రమ రవాణాగా తేల్చారు అక్కడి అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు భారతీయులతోపాటు, ఒక అమెరికన్.. మొత్తం ఏడుగురు కలిసి ఒక బోటులో సెయింట్ రెజిస్ రివర్‌లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో నీళ్లు గడ్డకట్టేంత చల్లగా ఉన్నాయి. అయితే, వీళ్ల బోటు ప్రమాదానికి గురైంది. అనుమానస్పదంగా ఏదో జరగడం గుర్తించిన రక్షణ సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పడవ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఒక్కరు మాత్రం ఎలాగోలా ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నిస్తుంటే, మిగతా ఆరుగురు మాత్రం దాదాపు మునిగిపోయారు.

Indian Army: రెండు వందల మంది తీవ్రవాదులు చొరబాటుకు సిద్ధం: ఇండియన్ ఆర్మీ

అయితే, అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఏడుగురినీ రక్షించారు. వాళ్లంతా చల్లటి నీటిలో మునిగిపోవడంతో చికిత్స అందించి, తర్వాత అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇది మానవ అక్రమ రవాణా అని పోలీసులు గుర్తించారు. భారతీయులు ఆరుగురు.. 19-21 ఏళ్ల వయసులోపే ఉన్నారు. వీళ్లందరినీ అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారన్న నేరం కింద అరెస్టు చేశారు. కాగా, పడవలో ప్రయాణిస్తున్న ఏడుగురికి ఎలాంటి లైఫ్ జాకెట్స్ కూడా లేవు. ప్రమాదకర పరిస్థితుల్లో తమనుతాము రక్షించుకునే ఎలాంటి సామగ్రి లేదు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవాళ్లు తమకొచ్చే ఆదాయం గురించే ఆలోచిస్తారని, వాళ్ల భద్రత గురించి ఆలోచించరని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.