Sleeping : అతిగా నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త

చాలా మంది రాత్రి నిద్రించాల్సిన సమయంలో నిద్రపోకుండా పగటి సమయంలో నిద్రపోతుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sleeping : అతిగా నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త

Sleep

Sleeping : మన శరీరం రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే సరిపడినంత నిద్ర ఎంతో అవసరం. నిద్ర ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు. అయితే కొంత మంది అతినిద్రకు అలవాటు పడి అదేపనిగా గంటలు, గంటలు సమయాన్ని నిద్రకే కేటాయిస్తుంటారు. ఇలా ఎక్కవ సమయం నిద్రపోవటం వల్ల అనేక సమస్యలు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది.

అతిగా నిద్రవల్ల కొన్ని మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రను నియంత్రించేందుకు శరీరంలో ఉత్పత్తి అయ్యే సెరోటోనిన్ హార్మోన్ అతినిద్ర వల్ల ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంటుంది. తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతే కాకుండా డీప్రెషన్ పెరిగే ప్రమాదం ఉంది. అదే పనిగా నిద్రపోవటం వల్ల రోజు వారి కార్యకలాపాలు స్థంభించి పోతాయి.

ఎలాంటి శారీరక వ్యాయామాలు లేకుండా అదే పనిగా నిద్రపోవటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటంతోపాటు, బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎనిమిది గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవాళ్లలో 35 శాతం గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్టు పరిశోధనలో తేలింది. అతిగా నిద్రపోవటం వల్ల ఆప్రభావం మెదడు పనితీరుపై పడుతుంది. శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయి. ఏకాగ్రత సామర్థ్యం దెబ్బతిని పనిపైనా శ్రద్ధ పెట్టలేరు.

చాలా మంది రాత్రి నిద్రించాల్సిన సమయంలో నిద్రపోకుండా పగటి సమయంలో నిద్రపోతుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అతినిద్ర కండరాలు ఒత్తిడికి గురై వెన్నునొప్పి , కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు వచ్చే అస్కారం అధికంగా ఉంటుంది. శరీరంలో శక్తిని తగ్గించి బద్దకం పెరిగిపోతుంది.

అతినిద్ర అనేది కొన్ని సందర్భాల్లో దీర్ఘనిద్రకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్‌లకు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్లను దూరంగా పెట్టాలి. రోజు వారి నిద్రకు సమయపాలన పాటించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.