Smriti Irani: గోవా బార్‌తో స్మృతి ఇరానీ కూతురుకు ఎలాంటి సంబంధం లేదు: ఢిల్లీ హైకోర్టు

స్మృతి ఇరానీకి, ఆమె కూతురు జోయిష్ ఇరానీకి గోవా బార్ అండ్ రెస్టారెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనికోసం వాళ్లు దరఖాస్తు కూడా చేయలేదని కోర్టు పేర్కొంది.

Smriti Irani: గోవా బార్‌తో స్మృతి ఇరానీ కూతురుకు ఎలాంటి సంబంధం లేదు: ఢిల్లీ హైకోర్టు

Smriti Irani

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి, ఆమె కూతురు జోయిష్ ఇరానీకి గోవాలోని బార్ అండ్ రెస్టారెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయడింది. వాళ్లిద్దరూ దీనికోసం ఎప్పుడూ దరఖాస్తు చేయలేదని చెప్పింది. స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే.

Nirmala Sitharaman: దేశంలో ఆర్థిక సంక్షోభానికి అవకాశమే లేదు: నిర్మలా సీతారామన్

ఈ ఆరోపణల్ని స్మృతి ఇరానీ ఖండించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ, నేతలు క్షమాపణలు చెప్పాలని కోరారు. తర్వాత ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరామ్ రమేష్, నెత్తా డిసౌజాకు స్మృతి ఇరానీ నోటీసులు జారీ చేశారు. తనపై ఆరోపణలకు సంబంధించిన ట్వీట్లు తొలగించాలని, లేదంటే రూ.2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు.

Jackfruit: పనస పండు కోసం ఏనుగు కష్టం.. వైరల్‌గా మారిన వీడియో

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. తాజా కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.