Smriti Mandhana : స్మృతి మందానకు 2021 ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు

భారత ఓపెనింగ్ ప్లేయర్ స్మృతి మందాన ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు దక్కింది. 2021 సీజ‌న్‌లో స్మృతీ మందాన అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌నతో ఆకట్టుకుంది.

Smriti Mandhana : స్మృతి మందానకు 2021 ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు

India Opener Smriti Mandhan

Smriti Mandhana :  భారత ఓపెనింగ్ ప్లేయర్ స్మృతి మందానకు ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు దక్కింది. 2021 సీజ‌న్‌లో స్మృతీ మందాన అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌నతో ఆకట్టుకుంది. ICC ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 (Women’s Cricketer of The Year for 2021)కి రాచెల్ హేహో ఫ్లింట్ అవార్డును మందాన గెలుచుకుంది. 2021 సీజన్‌లో స్మృతీ మందాన 22 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడగా.. 38.86 సగటుతో 855 పరుగులు రాబట్టింది. అందులో ఒక సెంచరీ సహా మరో 5 హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. తద్వారా ఆమెను (Rachael Heyhoe Flint Award) వరించింది. ఈ సీజన్ సమయంలో భారత మహిళా జట్టు కష్టతరంగానే నెట్టుకొచ్చింది. కానీ, స్మృతీ మందాన తనదైన శైలిలో ఆటతీరుతో అద్భుతంగా రాణించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత్ స్వదేశంలో ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకుంది. మందాన రెండు విజయాలలో కీలక పాత్ర పోషించింది. రెండో ODIలో భారత్ 158 పరుగులను చేధించడంతో మందాన 80 పరుగులు చేసి, సిరీస్‌ను సమం చేసింది. చివరి T20లో కూడా అదే దూకుడుగా ఆడి 48 పరుగుల నాటౌట్‌గా నిలిచి భారత జట్టుకు విజయాన్ని అందించింది.

ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో మందాన 78 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. వన్డే సిరీస్‌లో భారత్ సాధించిన ఏకైక విజయంలో ఆమె 49 పరుగులు చేసింది. T20 సిరీస్‌లో మందాన 15 బంతుల్లో 29 పరుగులు, 50 హాఫ్ సెంచరీ చేసిన ఫలితం లేకపోయింది. భారత్ రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. 2-1తో సిరీస్‌ను కోల్పోయింది.

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ మందాన అద్భుత ప్రదర్శన కనబర్చింది. ODI సిరీస్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ రెండో వన్డేలోనూ 86 పరుగులు చేసింది. ఏకైక టెస్టులో అద్భుతమైన సెంచరీని నమోదు చేసి తన కెరీర్‌లో మొదటి సెంచరీతో ఆకట్టుకుంది. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంది. ఆఖరి T20లో రెండో టీ20 హాఫ్ సెంచరీని సాధించింది, పింక్ బాల్ టెస్టులో సెంచ‌రీతో అదరగొట్టింది. అయినప్పటికీ భారత్ సిరీస్‌ను 2-0తో కోల్పోయింది.

Read Also : Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. త్వరలో ప్రకటన!