Allu Arjun : “అల్లు అర్జున్‌తో ఫొటోలు”.. గీతా ఆర్ట్స్ దగ్గర హంగామా

గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురుచూశారు. జై జై బన్నీ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

Allu Arjun : “అల్లు అర్జున్‌తో ఫొటోలు”.. గీతా ఆర్ట్స్ దగ్గర హంగామా

Allu Arjun Pushpa Fans

Allu Arjun : హైదరాబాద్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు అల్లు అర్జున్ అభిమానుల హంగామా కనిపించింది. అల్లు అర్జున్ తో ఫొటో దిగే అవకాశం ఉందంటూ సోషల్ మీడియా గ్రూప్ లలో ఓ పోస్ట్ చక్కర్లు కొట్టడమే కారణంగా తెలుస్తోంది. ఈ ఉదయం 10 గంటలకు అల్లు అర్జున్ తో ఫొటో సెషన్ ఉంటుందని ఆ పోస్టులో ఉండటంతో… ఫ్యాన్స్ ఆసక్తి చూపించారు. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి… వందలాది మంది అభిమానులు హైదరాబాద్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. అక్కడ క్యూ కట్టారు. ఐతే… ఆఫీస్ సిబ్బంది చెప్పిన ప్రకటన వారిని డిసప్పాయింట్ చేసింది.

Read Also : Pushpa: ఇండస్ట్రీకి బన్నీ బెస్ట్ గిఫ్ట్.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి

ఈ ఉదయం నుంచి పలు జిల్లాలకు చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్స్… హైదరాబాద్ వచ్చారు. ఆఫీస్ ముందు క్యూ కట్టారు. గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురుచూశారు. జై జై బన్నీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చాలామంది టిఫిన్లు, లంచ్ కూడా చేయకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎదురుచూసినట్టు చెప్పారు. లంచ్ టైంలో హీరో వచ్చి వెళ్తే తమకు అవకాశం రాదేమోనని.. అక్కడే క్యూలో ఉన్నట్టు చెప్పారు.

Read Also : Pushpa Film : పుష్ప ఈవెంట్‌‌పై పోలీసులు సీరియస్..కేసు నమోదు

ఐతే… అల్లు అర్జున్ తో ఫొటో సెషన్ ప్రకటించలేదని.. ఇలాంటి ప్రోగ్రామ్ ఇవాళ పెట్టుకోలేదని గీతా ఆర్ట్స్ సంస్థ సిబ్బంది అక్కడకు వచ్చిన అభిమానులకు తెలియజేసింది. దీంతో.. ఫ్యాన్స్ ఒక్కసారిగా అసంతృప్తికి లోనయ్యారు. ఫ్యాన్స్ గ్రూప్ లో వచ్చిన పోస్ట్ చూసి ఆఫీస్ కు వచ్చామన్నారు. ఫేక్ అయినా పర్లేదు… హీరో కనపడితే చాలు అని అభిమానులు చెప్పారు. ఎలాగోలా సంతృప్తి పరిచి పంపించే పనిలో ఆఫీస్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం.

పుష్ప-ప్రి రిలీజ్ ఈవెంట్ లోనూ ఇదే గందరగోళం
నిన్న ఆదివారం యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో “పుష్ప ప్రి-రిలీజ్ ఈవెంట్”కు ఊహించని దానికంటే ఎక్కువ మంది రావడంతో.. నిర్వాహకులు, ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు. కొంత తొక్కిసలాట కూడా జరిగింది. ఈవెంట్ మేనేజింగ్ సంస్థ ఎక్కువ పాస్ లు ఇష్యూ చేయడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది.