Pushpa Film : పుష్ప ఈవెంట్‌పై పోలీసులు సీరియస్..కేసు నమోదు
ఈవెంట్ జరిగిన తీరుపై పోలీసులు సీరియస్ అయ్యారు. కేవలం 5000 పాసెస్ మాత్రమే తీసుకుని ఎక్కువ పాసులు జారీ చేశారని...

Pushpa
Pushpa Event : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా సాగింది. అయితే ఈవెంట్ జరిగిన తీరుపై పోలీసులు సీరియస్ అయ్యారు. కేవలం 5000 పాసెస్ మాత్రమే తీసుకుని ఎక్కువ పాసులు జారీ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీంతో శ్రేయాస్ క్రియేషన్స్, ఈవెంట్ ఆర్గనైజేషన్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ కిశోర్ పై ఐపీసీ అండర్ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసు నమోదు చేశారు.
Read More : Pushpa: 4 సినిమాల కష్టం పుష్ప.. తగ్గేదే లే.. 17న వస్తున్నా..!
యూసుఫ్ గౌడ పోలీస్ గ్రౌండ్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 2021, డిసెంబర్ 12వ తేదీ ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుందని ముందుగానే ప్రకటించారు. దీంతో ఆదివారం ఉదయం నుంచే…యూసుఫ్ గూడ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి అల్లు అర్జున్ అభిమానులు పోటెత్తారు. గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. యూసుఫ్ గూడ రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అభిమానుల ఉత్సాహానికి అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకుని మరీ తోసుకరావడంతో…ఓ పరిస్థితిలో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. దీనిపై ఈవెంట్ మేకర్స్ సీరియస్ అయ్యారు. ఫాన్స్ శాంతించాలని సూచించారు. కానీ..అభిమానులు మాత్రమే ‘తగ్గేదే లే’ అన్నట్లు వ్యవహరించారు.
Read More : Pushpa Pre Release Event: ధూం ధాంగా.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..!
ఇక సినిమా విషయానికి వస్తే…అల్లు అర్జున్ హీరోగా..రష్మిక మందన హీరోయిన్లుగా నటించిన పుష్ప ఫిల్మ్ ఫస్ట్ పార్ట్ 2021, డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. దీనికి తగ్గట్టుగానే సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా…డిసెంబర్ 06వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి భారీగానే రెస్పాన్స్ వచ్చింది. బన్సీ ఫెర్మామెన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. సమంత స్పెషల్ సాంగ్ కూడా రికార్డులు సృష్టిస్తోంది. అనసూయ ఒక డిఫరెంట్ పోషిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్ లు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా పుష్ప మూవీని నిర్మించారు.