Mother-Son emotional video viral : కంట తడి పెట్టిస్తున్న తల్లీ-కొడుకుల ఎమోషనల్ వీడియో
కరోనా కారణంగా కొన్నేళ్లుగా తల్లిదండ్రుల్ని కలవలేక విదేశాల్లోనే ఉండిపోయిన బిడ్డలు చాలామంది ఉన్నారు. రీసెంట్‌గా స్విట్జర్లాండ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఈ తల్లీకొడుకుల వీడియో వైరల్ అవుతోంది.

Viral Video
Viral Video : కరోనా కారణంగా చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉండిపోయిన తెలుగువాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే తమవారిని కలుసుకునేందుకు ఇండియా వస్తున్నారు. 5 సంవత్సరాల స్విట్జర్లాండ్‌లో ఉండిపోయి కేరళకు వచ్చిన కొడుకు తల్లిని చూసి ఎమోషనల్ అయిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో.. కథనం వైరల్ అవుతోంది. అందరినీ కంట తడిపెట్టిస్తోంది.
కేరళకు చెందిన రోజన్ పరంబిల్ స్విట్జర్లాండ్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పని చేస్తున్నారు. కోవిడ్ కారణంగా దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసి ఆయన షాకయ్యారు. వీరిద్దరు కలిసిన మధురమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మిస్టర్ పరంబిల్ తన తల్లిని ఆమె స్వస్థలమైన అతిరుంపుజ చూపించడానికి ఎత్తుకుని కారు దగ్గరకు తీసుకెళతారు. ఆ సమయంలో ఓ స్త్రీ టీ కప్పు అందిస్తుంటే దానిని సంతోషంగా ఆవిడ సిప్ చేసింది. ఆ తరువాత తల్లికొడుకులిద్దరూ సెల్ఫీని తీసుకున్నారు.
పరంబిల్ కొన్నేళ్ల క్రితం స్విట్జర్లాండ్ తీసుకెళ్లి యూరప్ మొత్తం చూపించారట. అక్కడి ప్రదేశాలు చూసి ఆవిడ ముచ్చటపడిందట. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఇండియా రాగానే అమ్మని చూడగానే గుండె పగిలిపోయిందని పరంబిల్ అన్నారు. ఆమె చాలా పెద్దది అయిపోయినట్లు.. సరిగ్గా నిలబడలేక, నడవలేని స్థితిలో కనిపించిందట. ఎలాగైనా ఆమెను బయటకు తీసుకెళ్లాలని పరంబిల్ డిసైడ్ అయ్యారు. కారులో వెళ్తుంటే చాలా ప్రదేశాలు ఆమెకు గుర్తు రాలేదట. ప్రయాణంలో ఆమె బాగా అలసిపోయినా తను కోరుకునే విధంగా చూపించినందుకు సంతోషంగా ఉందని పరంబిల్ అన్నారు. పరంబిల్ తరపున వీడియోను, ఆయన నోట్‌ను officialhumansofkeralam ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్టును షేర్ చేశారు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్‌ను కదిలించింది.
China : ‘ఫుల్ టైం డాటర్’ తల్లిదండ్రులు కూతురికి ఇచ్చిన ఉద్యోగం
‘ఈ పోస్టు చూసి కన్నీరు ఆపుకోలేకపోయాను’ అని ఒకరు.. ‘అమ్మని మరవలేము.. వారితో గడిపిన ప్రతిక్షణం ఎంతో విలువైనది.. జ్ఞాపకాలు మాత్రమే తర్వాత మిగిలిపోతాయి’.. అంటూ ఇంకొకరు కామెంట్లు చేశారు. ముఖ్యంగా అమ్మా,నాన్నలకు దూరంగా ఉన్న బిడ్డలను ఈ వీడియో మరింతగా కదిలించింది.
View this post on Instagram