Sonia Agarwal : తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న ‘7/G బృందావన కాలనీ’ భామ

మెయిన్ లీడ్ గా తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది సోనియా. సోనియా అగర్వాల్ మెయిన్ లీడ్ గా ‘డిటెక్టివ్‌ సత్యభామ’ అనే సినిమా రాబోతుంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అంతం చేసే.....

Sonia Agarwal : తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న ‘7/G బృందావన కాలనీ’ భామ

Sonia (1)

Sonia Agarwal :  ‘నీ ప్రేమకై’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ సోనియా అగర్వాల్. ఆ తర్వాత ‘7/G బృందావన కాలనీ’ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు అది కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. కాని తమిళ్ లో మాత్రం వరుస సినిమాతో బిజీగానే ఉంది ఈ భామ. తాజాగా మెయిన్ లీడ్ గా తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది సోనియా.

విక్కీ కత్రినా పెళ్లి వేడుకలు

సోనియా అగర్వాల్ మెయిన్ లీడ్ గా ‘డిటెక్టివ్‌ సత్యభామ’ అనే సినిమా రాబోతుంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అంతం చేసే ఓ లేడీ డిటెక్టివ్ గా సోనియా ఇందులో నటించింది. ఈ సినిమాని నవనీత్‌ చారి తెరకెక్కిస్తుండగా శ్రీశైలం పోలెమోని నిర్మించారు. తాజాగా నిన్న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ ముఖ్య అతిధిగా విచ్చేసారు. సోనీ అగర్వాల్‌ ఈ సినిమా కథను సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేశారని డైరెక్టర్ చెప్పారు.