షిరిడీలో సోనూ సూద్.. ‘రియల్ హీరో’ అంటూ అరుపులు.. భారీగా ట్రాఫిక్ జామ్..

షిరిడీలో సోనూ సూద్.. ‘రియల్ హీరో’ అంటూ అరుపులు.. భారీగా ట్రాఫిక్ జామ్..

Sonu Sood Visited Shirdi: లాక్‌‌డౌన్ సమయంలో ఎంతోమందిని ఆదుకుని రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూ సూద్.. ఇప్పటికీ అవసరమైన వారికి సాయమందిస్తూ, రియల్ హీరో, హెల్పింగ్ హ్యాండ్ అనిపించుకుంటున్నారు.. తాజాగా ఆయన షిరిడీ సాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. సోనూ సూద్ రాకతో ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సోనూ వచ్చారనే వార్త తెలియగానే భక్తులతో పాటు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలివచ్చారు. సోనూని చూడగానే ‘రియల్ హీరో.. రియల్ హీరో’.. ‘లవ్యూ సార్’.. అంటూ నినాదాలు చేశారు.

సోనూ అందరికీ సెల్యూట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయంలోనుండి బయటకు వచ్చిన తర్వాత కార్ ఎక్కి అక్కడివారికి అభివాదం చేశారు. ఆ సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కాగా తెలుగులో సోనూ సూద్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘అల్లుడు అదుర్స్’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారాయన.