Virat Kohli: ‘టెస్టు కెప్టెన్‌గా కోహ్లీకిదే చివరి అవకాశం’
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దనీశ్ కనేరియా ప్రస్తుతం నడుస్తోన్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై సంచలన కామెంట్లు చేశారు. విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు కెప్టెన్సీ బదిలీ కావడంతో

Virat Kohli
Virat Kohli: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దనీశ్ కనేరియా ప్రస్తుతం నడుస్తోన్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై సంచలన కామెంట్లు చేశారు. విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు కెప్టెన్సీ బదిలీ కావడంతో యావత్ క్రికెట్ ప్రపంచమంతా విమర్శలు గుప్తిస్తుంది. దీనిపై కనేరియా కూడా రెస్పాండ్ అయి.. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని అంటున్నాడు. టీ20 కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవడం, వన్డే కెప్టెన్ గా బీసీసీఐ తప్పించడం వెనుక నిజమిదే అంటున్నాడు.
‘విరాట్ కోహ్లీకి ఈ పర్యటన చాలా కీలకం. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా అస్సలు గెలవలేదు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో మాత్రం గెలిచింది. కానీ, దక్షిణాఫ్రికాలో గెలవడానికి విరాట్ కోహ్లీకి కెప్టెన్ గా ఇది లాస్ట్ ఛాన్స్. అతనే పరుగులు చేసి జట్టును నడిపించాలి. బీసీసీఐ అతణ్ని వన్డే కెప్టెన్ గా తప్పించినందుకు ప్రూవ్ చేసుకోవాల్సింది’ అని దనీశ్ కనేరియా యూట్యూబ్ ఛానెల్ లో వివరించాడు.
దక్షిణాఫ్రికాలో ఇండియా టెస్టు సిరీస్ గెలుచుకోలేదు. చివరి మూడు గేమ్ లలో బాగానే రాణించినప్పటికీ.. 2-1తేడాతో ఓటమికి గురయ్యారు.
……………………………….. : బిగ్‌బాస్ షోలోకి మాజీ కంటెస్టెంట్స్
‘అనుభవం, నమ్మకం, కాన్ఫిడెన్స్ లు దృష్టిలో ఉంచుకుని ఏదైనా స్పెషల్ గా చేయాలనుకుంటున్నాం. టీంగా క్లిష్టమైన పరిస్థితుల్లోనూ గెలవాలని అనుకుంటాం. ఇప్పటి వరకూ గెలవని ప్లేస్ ఉందంటే అది దక్షిణాఫ్రికానే. అందుకే బాగా మోటివేట్ అయి ఉన్నాం’ అని బుధవారం జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో కోహ్లీ అన్నాడు.
‘మా పూర్తి సామర్థ్యం చూపించి గెలిచేందుకే ప్రయత్నిస్తాం. టెస్టు గెలవడాని కంటే వేరే ఆప్షన్ లేదు’ అని వెల్లడించాడు.