Arjuna Phalguna: శ్రీవిష్ణు క్రేజీ టైటిల్స్.. ఫెయిల్యూర్ ఫాల్‌ఆన్‌కి బ్రేకేస్తాడా?
ఆడియన్స్ కి సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యాలంటే టైటిల్ ని క్యాచీగా పెట్టాలి. టైటిల్ క్యాచీగా ఉంటేనే కాదు.. ఇంట్రస్టింగ్ గా ఉండాలి. అప్పుడే ఈ సినిమా ఏదో డిఫరెంట్ గా ఉందని..

Arjuna Phalguna
Arjuna Phalguna: ఆడియన్స్ కి సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యాలంటే టైటిల్ ని క్యాచీగా పెట్టాలి. టైటిల్ క్యాచీగా ఉంటేనే కాదు.. ఇంట్రస్టింగ్ గా ఉండాలి. అప్పుడే ఈ సినిమా ఏదో డిఫరెంట్ గా ఉందని కాన్సన్ ట్రేట్ చేస్తారు. అయితే ఇది అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు. కొన్ని సినిమాల టైటిల్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి కానీ.. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. లేటెస్ట్ గా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు శ్రీవిష్ణు.
Samantha: లైఫ్ గురించి సామ్ చెప్పిన కొత్త నిర్వచనం.. పోస్ట్ వైరల్!
ఈ జనరేషన్ యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు.. సమ్ థింగ్ డిఫరెంట్. యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉన్నా.. ఇంకా హీరోగా సక్సెస్ అందుకోడానికి తడబడుతూనే ఉన్నాడు. సినిమా కోసం తన వంతు ఎఫర్ట్ 100 పర్సెంట్ ఇచ్చే శ్రీవిష్ణు.. హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. హిట్ సంగతి ఎలా ఉన్నా.. ఈ హీరో సినిమా టైటిల్స్ మాత్రం అదిరిపోయేలా ఉంటాయి. ఇప్పటి వరకూ ఈజీ గోయింగ్, కామెడీ ఎంటర్ టైనర్స్ చేసిన విష్ను ఫస్ట్ టైమ్ కంప్లీట్ సీరియస్ డ్రామా చేస్తున్నాడు. లేటెస్ట్ గా అర్జున – ఫల్గుణ అంటూ మరో క్రేజీ టైటిల్ తో రెడీ అయ్యాడు శ్రీవిష్ణు.
RRR: జక్కన్న నాటు ప్రమోషన్స్.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!
శ్రీవిష్ణు సినిమాల మీద జనరల్ గానే క్రేజ్ ఉటుంది. తన సినిమా టైటిల్స్ తో సినిమా మీద మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాడు. ఈ ఇంట్రస్ట్ సినిమా చూసేప్పుడు మాత్రం ఆడియన్స్ లో కనిపించదు. కోవిడ్ సెకండ్ వేవ్ లో రిలీజ్ చేసిన గాలి సంపత్, రాజరాజచోరకూడా ఇంట్రస్టింగ్ టైటిల్స్ తోనే ఆడియన్స్ ముందుకొచ్చాడు. గాలి సంపత్ మరీ గాలి తీసేస్తే.. రాజరాజచోర హిట్ కాకపోయినా పర్వాలేదనిపించుకున్నాడు.
Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్.. 26 ఏళ్ల రికార్డ్ బద్దలు!
ఈ సినిమాలే కాదు.. శ్రీవిష్ణు ప్రతి సినిమా టైటిల్ అంతే ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. అంతకుముందు చేసిన వీరభోగవసంతరాయలు, తిప్పరా మీసం లాంటి క్యాచీ, సమ్ థింగ్ డిఫరెంట్ టైటిల్స్ తో క్రేజ్ క్రియేట్ చేశాడు విష్ను. సినిమా పేర్లు బావున్నా.. సినిమాలు మాత్రం పేరు తీసుకురాలేకపోయాయి. మరి ఈ సారి అర్జున – ఫల్గుణ సినిమా ఈ ఫాలోఆన్ కి బ్రేక్ వేస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు విష్ను.