Ustaad Trailer : శ్రీసింహ ఉస్తాద్ ట్రైలర్ రిలీజ్.. బైక్.. విమానం.. ప్రేమ..
శ్రీసింహ కోడూరి నటిస్తున్న ఇన్‌స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీ మూవీ 'ఉస్తాద్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Sri simha Koduri Kavya kalyan Ram Ustaad Trailer released
Ustaad Trailer : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి (MM keeravani) కొడుకు శ్రీసింహ కోడూరి (Sri simha Koduri) ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ అండ్ యూత్ ఫుల్ కాన్సెప్ట్ మూవీస్ ఆడియన్స్ ముందుకు సినిమాలు తీసుకు వస్తున్న శ్రీసింహ.. తాజాగా ‘ఉస్తాద్’ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇప్పుడు మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
Sreeleela : శ్రీలీల స్టార్‌డమ్ మాములుగా లేదుగా.. అప్పుడే చీఫ్ గెస్ట్ రేంజ్‌కి వచ్చేసింది..
ట్రైలర్ చూస్తుంటే మూవీ ఇన్‌స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో రాబోతుందని అర్ధమవుతుంది. శ్రీసింహ ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయిగా.. తన కన్న కల కోసం, ప్రేమ కోసం ఫైట్ చేసే పాత్రలో కనిపించబోతున్నాడు. బైక్ డ్రైవింగ్ అంటే ఒక ప్యాషన్ గా అనుకునే హీరో.. అదే ప్యాషన్ తో విమానం నడపాలనే గమ్యాన్ని ఎంచుకుంటాడు. ఈ గమ్యంలో ఎదురయ్యే సన్నివేశాలను చాలా నేచురల్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఆకట్టుకునేలా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రైలర్ చూసేయండి.
కాగా ఈ సినిమాని ఫణిదీప్ డైరెక్ట్ చేస్తున్నాడు. వరుస విజయాలతో ఉన్న కావ్య కళ్యాణ్ రామ్ (Kavya kalyan Ram) ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ మూవీని వారాహి బ్యానర్ లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అకీవా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రిలీజ్ కి ముందు చిరు – భోళా శంకర్, రజిని – జైలర్ సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మరి వాటి మధ్య రిలీజ్ అయ్యి ఈ మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.