Roshan : పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్ కొడుకు.. మోహన్ లాల్‌కి తనయుడిగా రోషన్..

తాజాగా రోషన్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. ఏకంగా మోహన్ లాల్ నటించే పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు.

Roshan : పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్ కొడుకు.. మోహన్ లాల్‌కి తనయుడిగా రోషన్..

Srikanth son Roshan plays son role for Mohan Lal Pan India Movie Vrushabha

Updated On : July 13, 2023 / 12:15 PM IST

Roshan Mohan Lal : శ్రీకాంత్(Srikanth) వారసుడిగా రోషన్ సినీ పరిశ్రమలోకి నిర్మలా కాన్వెంట్ మూవీతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోషన్. హీరోగా కె.రాఘవేంద్ర రావు(Raghavendra Rao) పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘పెళ్లిసందD’ సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం రోషన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ‘ఛాంపియన్’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే వేదాంష్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌లో మరో సినిమా చేస్తున్నాడు.

తాజాగా రోషన్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. ఏకంగా మోహన్ లాల్ నటించే పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మాణంలో నంద కిషోర్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా ‘వృషభ’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో 2024లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Nani 30 : నాని 30 అప్డేట్ వచ్చేసింది.. ‘హాయ్ నాన్న’ అంటూ వచ్చేస్తున్న నాని..

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైందని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో మోహన్ లాల్ కొడుకుగా నటించబోతున్నట్టు సమాచారం. దీనికి రోషన్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో కెరీర్ ఆరంభంలోనే రోషన్ కి పాన్ ఇండియా ప్రాజెక్టు వచ్చిందని, మోహన్ లాల్ తో నటించే అవకాశం వచ్చిందని, చాలా అదృష్టవంతుడని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కరెక్ట్ గా వర్కౌట్ అయితే రోషన్ తండ్రిని మించిన హీరో అవుతాడని అంటున్నారు. ఇక ఈ వృషభ సినిమా తండ్రి కొడుకుల మధ్య కథతో తెరకెక్కనుంది కాబట్టి ఇందులో రోషన్ కి నటించడంఐకి మంచి స్కోప్ కూడా దొరుకుతుందని పలువురు భావిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)