Tollywood : అప్పుడే దసరాకి మొదలైన ఫైట్.. స్టార్లంతా సిద్ధం..

ఇప్పటి వరకు దసరా బరిలో నిలిచే సినిమాలు ఏంటో ఎవరూ ఊహించలేదు. కేవలం నాని సినిమా టైటిల్ ను బట్టే దసరాకి వస్తుందని అనుకున్నారు కాని దసరాకు బాక్సాఫీస్ ముందు భారీ యుద్ధం............

Tollywood : అప్పుడే దసరాకి మొదలైన ఫైట్.. స్టార్లంతా సిద్ధం..

God Father

Dasara :  ఇప్పటి వరకు దసరా బరిలో నిలిచే సినిమాలు ఏంటో ఎవరూ ఊహించలేదు. కేవలం నాని సినిమా టైటిల్ ను బట్టే దసరాకి వస్తుందని అనుకున్నారు కాని దసరాకు బాక్సాఫీస్ ముందు భారీ యుద్ధం జరగబోతుందనే ఇండికేషన్ టీజర్ తోనే పంపించారు మెగాస్టార్. నందమూరి నటసింహం కూడా అప్పుడే బరిలోకి దిగి, ఆయుధ పూజ చేయాలనుకుంటున్నారు. సో ఈ దసరా కు బిగ్ స్టార్స్ ఫైట్ రసవత్తరంగా ఉంటుందని ఇప్పటి నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు.

ఆచార్యతో నిరాశ చెందిన ఫ్యాన్స్ గాడ్ ఫాదర్ తో మెగాస్టార్ కంబ్యాక్ ఓ రేంజ్ లో ఉండాలని అనుకుంటున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ లుక్ టీజర్ వదిలి, ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. ఈ దసరాకే థియేటర్లకు వస్తున్నట్టు ఈ లుక్ టీజర్ లోనే ప్రకటించిన టీమ్ మెగా ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చారు. మోహన్ రాజా డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు తెలుగు రీమేక్ గా వస్తోంది. ఇప్పటికే తెలుగులో రీమేక్ అయిన మలయాళ మూవీస్ అన్నీ సూపర్ డూపర్ సక్సెస్ అవుతున్నాయి. దాంతో మెగాస్టార్ ను ఓ కొత్త లుక్ లో ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా కూడా భారీ హిట్ ఇస్తుందని అంచనాలేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ .

Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

అఖండ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ 107వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ మాస్ లుక్ తోనే ఫ్యాన్స్ ఎగ్జైట్ ఫీలయ్యారు. టీజర్ తో పూనకాలే వచ్చేశాయి. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే క్యారెక్టర్ లో కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అవుట్ డోర్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ టైమ్ కి పూర్తయితే ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని చూస్తున్నారు సినిమా టీమ్. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొడతారనే అంచనాలతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

నాని ఫస్ట్ టైమ్ తెలంగాణ యాసలో డైలాగ్ లు చెబుతూ ఓ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న దసరా సినిమా కూడా దసరాకే రిలీజ్ చేస్తారని అంతా భావిస్తున్నారు. బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 20న నాని లుక్ టీజర్ రిలీజ్ చేసి, అంచనాలు పెంచేశారు. ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ధనుష్ డైరెక్ట్ తెలుగులో నటిస్తున్న ఫస్ట్ సినిమా ‘సార్’ కూడా దసరాకే రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దసరా బరిలో ఈ నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇవే కాక మరిన్ని చిన్న, మీడియం సినిమాలు కూడా జత చేరనున్నాయి. దీంతో ఈ దసరాకి పోటీ మరింత రసవత్తరంగా ఉండబోతుంది.