జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం

  • Published By: bheemraj ,Published On : December 1, 2020 / 01:40 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం

GHMC elections exit polls ban : జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం విధించింది. ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో ఎన్నిక రద్దు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాయి.

అయితే ఓల్డ్ మలక్ పేటలో బ్యాలెట్ పై గుర్తులు తారుమారు కావడంతో అక్కడ పోలింగ్ ను ఎస్ఈసీ రద్దు చేసింది. ఎల్లుండి రీపోలింగ్ కు ఆదేశించింది. ఇవాళ సాయంత్రం ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవద్దని ఆదేశించింది. డిసెంబర్ 3న రీపోలింగ్ తర్వాతే ఎగ్జిట్ పోల్స్ కు అవకాశం ఇచ్చింది.



ఓల్డ్ మలక్ పేటలో గుర్తులు తారుమారు కావడంతో ఎస్ ఈసీ పోలింగ్ రద్దు చేసింది. సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు ముద్రితం కావడంతో పోలింగ్ ను రద్దు చేశారు. 26 వ నెంబర్ వార్డులో బ్యాలెట్ పేపర్ పై ముద్రితమైంది. కంకి కొడవలి గుర్తు స్థానంలో సుత్తి కొడవలి గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్ ను రద్దు చేశారు. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఎన్నిక నిలిపివేయాలని చాడా డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం వల్లే కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తు ముద్రితమైందని అన్నారు. ఏ అధికారి వల్ల తప్పు జరిగిందో గుర్తించి అతనిపై చర్య తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.



దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ కమిషనర్ ను నివేదిక కోరింది. ఓల్డ్ మలక్ పేట్ లో ఈసీ పోలింగ్ ను నిలిపివేసింది. ఈ నెల 3న రీపోలింగ్ నిర్వహించనున్నారు.