COVID-19 : ప్రతొక్కరూ ఇంట్లోనే ఉండండి..రవీంద్ర జడేజా వీడియో సందేశం

ప్రతొక్కరూ ఇంట్లోనే ఉండండి..సురక్షితంగా ఉండాలని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా..వీడియో సందేశం ఇచ్చారు.

COVID-19 : ప్రతొక్కరూ ఇంట్లోనే ఉండండి..రవీంద్ర జడేజా వీడియో సందేశం

Jadeja

Stay Safe : ప్రతొక్కరూ ఇంట్లోనే ఉండండి..సురక్షితంగా ఉండాలని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా..వీడియో సందేశం ఇచ్చారు. భారతదేశంలో కరోనా సెకండ వేవ్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..జడేజా ఓ వీడియో సందేశం ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉంటే..కరోనాను జయించే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

మాస్క్ లు కంపల్సరీ ధరించాలని, అలాగే చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంట్లోనే ఉంటూ..ఇతరులను కూడా ఈ కరోనా వైరస్ నుంచి జయించవచ్చని తెలిపారు. అలాగే..అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలని, చొరవ తీసుకుని సహాయం చేయాలని పిలుపునిచ్చారాయన. ఈయన చేసిన ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది. కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది. పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ ను వాయిదా వేశారు. దీంతో టీం సభ్యులు వారి వారి స్వస్వలాలకు వెళ్లిపోయారు.

Read More : Covid Blood clots: ‘చాలా కొవిడ్ కేసుల్లో ఐదో రోజు నుంచే రక్తం గడ్డ కడుతుంది’