Stomach Leeches : జీవాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పొట్ట జలగలు

గొర్రెలను మేపే ప్రదేశాలను అడగటం లేదంటే పేడలో చిన్న జలగల గ్రుడ్లను పేడ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. జలగలు జీవాల కడుపులోకి చేరిన సందర్భంలో కొన్ని లక్షణాల ద్వారా గుర్తించ వచ్చు.

Stomach Leeches : జీవాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పొట్ట జలగలు

Sheeps

Updated On : December 26, 2021 / 12:42 PM IST

Stomach Leeches : జీవాల ఆరోగ్యానికి పొట్టజలగలు తీవ్రంగా దెబ్బతీస్తాయి. పశువుల్లో, గొర్రెల్లో పొట్ట జలగలు ఉదృతి ఎక్కవగా కనిపిస్తాయి. పొట్ట జలగలు ఆశించిన పశుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. రైతులు వీటి గురించి పట్టించుకోకుంటే ఆర్ధికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా ఈ జలగల జీవితం నత్తలపైన ఆదారపడి ఉంటుంది. నత్తలు ఎక్కువగా నీరు నిల్వఉండే ప్రాంతాల్లో అనగా కాలువలు, తడినేలలు, గుంతల్లో మొక్కలకు అతుక్కుని జీవిస్తుంటాయి. పెద్ద జలగలు గుడ్లను పెట్టి పురుగులుగా ఉన్న సమయంలో నత్తల్లోకి చేరుతాయి. పురుగులు పెద్దవిగా మారి నత్తలు అంటుకునే మొక్కలకు అంటుకుంటాయి. జీవాలు ఆమొక్కలను ఆహారంగా తీసుకునే సందర్భంలో వాటి చిన్న ప్రేగుల్లోకి చేరి ఆతరువాత నెమరు పొట్టలోకి చేరతాయి. అక్కడే పెద్దవై గ్రుడ్లు పెట్టి పేడలోకి వదులు తాయి.

గొర్రెలను మేపే ప్రదేశాలను అడగటం, లేదంటే పేడలో చిన్న జలగల గ్రుడ్లను పేడ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. జలగలు జీవాల కడుపులోకి చేరిన సందర్భంలో కొన్ని లక్షణాల ద్వారా గుర్తించ వచ్చు. జీవాలు నిరంతరంగా పారుతుంటాయి. భరించలేని వాసనతో కూడిన విరేచనాలు అవుతుంటాయి. గొంతు క్రింద నీరు చేరినట్లు వాపు వస్తుంది. జీవాలకు ఆకలి మందగించి, బరువు తగ్గటం, నీరసంగా ఉంటాయి.

ఇలాంటి సందర్భాల్లో పశువైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్సనందించాలి. ఆక్సీ క్లోజనైడ్ ఏ15 మి.గ్రా ఒక కేజీ బరువుకు రెండు రోజులు ఇస్తే చిన్న జలగలను పూర్తిగా తొలగించవచ్చు. లేదా నిక్లోజమైడ్ ఏ 100 మి.గ్రా ఒక కేజీ బరువునకు ఒక్కసారి ఇవ్వాలి. నీరసాన్ని తగ్గించే విధంగా రింగర్ లాక్టేట్ , గ్లూకోస్ సెలైనులను రక్తంలోకి ఇవ్వాలి. ఎలెక్ట్రోలైట్ల పౌడర్ లు నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు ఇవ్వాలి.

గొంతు క్రింద వాపు తగ్గించటానికి ఇంజక్షన్లు ప్యురోసమైడ్ ను లేదంటే సున్నపు తేటను పూయాలి. రక్త లోపం ఉంటే ఐరన్ కలిగిన ఫెరిటాస్ ఇంజక్షన్లు , లేదంటే శార్కోఫెరోల్ ద్రావణాన్ని లేదంటే బెల్లం పాకాన్ని తయారు చేసి రోజుకు 3సార్లు తాగించాలి. తడినేలలు , వరద వచ్చిన ప్రాంతాల్లో 2,3 నెలల వరకు జలగలు ఎక్కువగా మొక్కలను అతుక్కుని ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో జీవాలను మేపకూడదు. నత్తలు ఉండే ప్రదేశాల్లో మేపకుండా ఉండాలి. నత్తలు లేకుండా నీటి కుంటలు, డ్రైనేజీలు మూసివేయాలి.