Rahul on Modi black magic comments: ప్రధాని పదవి హుందాతనాన్ని దిగజార్చొద్దు: మోదీకి రాహుల్ సూచన

‘‘బ్లాక్ మ్యాజిక్ మెంటాలిటీని వ్యాపింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాయి. నల్ల దుస్తులు ధరించడం వల్ల నైరాశ్యపు రోజులు ముగిసిపోతాయని భావించేవారు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేరన్నారు. బ్లాక్ మ్యాజిక్‌, మూఢ నమ్మకాలను తాము నమ్మినప్పటికీ, ప్రజల్లో తమపై నమ్మకం తిరిగి రాదని వారికి తెలియడం లేదదు’’ అని పానిపట్‭లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోదీ అన్నారు.

Rahul on Modi black magic comments: ప్రధాని పదవి హుందాతనాన్ని దిగజార్చొద్దు: మోదీకి రాహుల్ సూచన

Stop lowering dignity of PM post says Rahul on Modi black magic comments

Rahul on Modi black magic comments: చేతబడి వంటి మూఢ నమ్మకాల గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవి హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని దొగజార్చొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ సూచించారు. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేతలు ఈ నెల 5న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారు నల్ల దుస్తులు ధరించారు. దీనిపై మోదీ బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాలా జాదూ(చేతబడి లాంటి మూఢ నమ్మకాలు)ను నమ్మేవారు ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోలేరని విమర్శించారు.

‘‘బ్లాక్ మ్యాజిక్ మెంటాలిటీని వ్యాపింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాయి. నల్ల దుస్తులు ధరించడం వల్ల నైరాశ్యపు రోజులు ముగిసిపోతాయని భావించేవారు ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేరన్నారు. బ్లాక్ మ్యాజిక్‌, మూఢ నమ్మకాలను తాము నమ్మినప్పటికీ, ప్రజల్లో తమపై నమ్మకం తిరిగి రాదని వారికి తెలియడం లేదు’’ అని పానిపట్‭లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోదీ అన్నారు.

దీనికి రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘మోదీ గారూ, మీ చీకటి పనులను మరుగుపరచడం కోసం చేతబడి వంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడటం ద్వారా ప్రధాన మంత్రి పదవికి ఉన్న ఔన్నత్యం, హుందాతనాలను దిగజార్చకండి. మూఢ నమ్మకాలపై కాదు. ప్రజా సమస్యలపై జవాబు ఇవ్వండి’’ అని ట్వీట్ చేశారు.

Arvind Kejriwal to centre: అందుకే ప్రజలకు ‘ఉచితాలు’ వద్దని అంటున్నారు: సీఎం కేజ్రీవాల్