Arvind Kejriwal to centre: అందుకే ప్రజలకు ‘ఉచితాలు’ వద్దని అంటున్నారు: సీఎం కేజ్రీవాల్

కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తోన్న ‘ఉచితాల’ హామీలపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై కేజ్రీవాల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని అనిపిస్తోందని, ప్రజలకు ఉచిత పథకాలు అందించడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోన్న తీరే ఇందుకు కారణమని చెప్పారు.

Arvind Kejriwal to centre: అందుకే ప్రజలకు ‘ఉచితాలు’ వద్దని అంటున్నారు: సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal to centre

Arvind Kejriwal to centre: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తోన్న ‘ఉచితాల’ హామీలపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై కేజ్రీవాల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై  విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని అనిపిస్తోందని, ప్రజలకు ఉచిత పథకాలు అందించడాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోన్న తీరే ఇందుకు కారణమని చెప్పారు.

సామాన్య ప్రజానీకంపై పన్నుల భారాన్ని పెంచేస్తూ, ధనవంతులపై మాత్రం పన్నుల భారం పడకుండా వాటిని కేంద్ర సర్కారు మాఫీ చేస్తోందని కేజ్రీవాల్  విమర్శించారు. పెన్షన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద నగదు లేదంటూ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారని కేజ్రీవాల్ అన్నారు. సైనికులకు పెన్షన్లు ఇవ్వలేని స్థితి దేశంలో 75 ఏళ్ళలో ఎన్నడూ లేదని ఆయన చెప్పారు. కాగా, ఉచిత విద్య అందిస్తే తప్పేంటని కేజ్రీవాల్ ఇటీవల కూడా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం.. విద్య, ఆరోగ్య సదుపాయాలు ఉచితంగా కల్పించడం, రాత్రి పూట పేదలకు శిబిరాలు ఏర్పాటు ఏర్పాటు చేసి ఇవ్వడంపై ఎన్నికల సమయంలో ప్రసంగాలు చేయడం, హామీలు ఇవ్వడం వంటివి హక్కుగా ఉన్నాయని ఆప్ అంటోంది. ఉచిత విద్యుత్తు, నీళ్ళు, రవాణా సౌకర్యాలు కల్పిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వకూడదంటూ నిబంధన తీసుకురావడం సరికాదని చెప్పింది. సామాజిక, సంక్షేమ అజెండాను ఎన్నికల హామీల్లోంచి తీసివేసి, కుల, మతపర హామీలు ఇవ్వాలని పిటిషనర్ కోరుకుంటున్నట్లు ఉందని పేర్కొంది.

గుజరాత్ లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ విద్యుత్తు, విద్య వంటి వాటిని ఉచితంగా అందించే విషయంపై హామీలు ఇస్తోంది. ఈ సమయంలో ‘ఉచితాల’పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుండడం గమనార్హం. ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టేలా ‘ఉచితాల’ హామీలు తీవ్రమైన సమస్య అని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొందరికి సంబంధించిన 10 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసిందని, పేదలకు ఉచితంగా పథకాలు అందిస్తే తప్పేంటని కేజ్రీవాల్ అంటున్నారు.

China-Taiwan conflict: యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయన్న చైనా.. సైనిక విన్యాసాలు చేపట్టిన తైవాన్