Color Photo : సుహాస్ హీరోనా అంటూ చీప్ లుక్ ఇచ్చారు..

సుహాస్.. ''కలర్‌ ఫొటో షూటింగ్‌ సమయంలో ఇది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ అని, ఇందులో సునీల్‌ హీరో అని, నేను, హర్ష క్యారెక్టర్స్‌ వేస్తున్నామని అందరికి చెప్పేవాడిని, వాళ్ళని కూడా......

Color Photo : సుహాస్ హీరోనా అంటూ చీప్ లుక్ ఇచ్చారు..

Alitho Saradaga

 

Alitho Saradaga :  సుహాస్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా, సునీల్ విలన్ గా కొత్త దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కలర్ ఫోటో. కరోనా కారణంగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవలే నేషనల్ అవార్డు కూడా అందుకుంది. షార్ట్ ఫిలిమ్స్ చేసే రేంజ్ నుంచి నేషనల్ అవార్డు దాకా ఎదిగారు ఈ చిత్ర యూనిట్. అవార్డు వచ్చాక పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు ఈ చిత్ర యూనిట్. తాజాగా దర్శకుడు సందీప్ రాజ్, హీరో సుహాస్ ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి రాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు.

ఈ ప్రోమోలో సరదా విషయాలు, తమ కష్టాలు, కలర్ ఫోటో సినిమా ప్రయాణం గురించి మాట్లాడారు. సుహాస్.. ”కలర్‌ ఫొటో షూటింగ్‌ సమయంలో ఇది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ అని, ఇందులో సునీల్‌ హీరో అని, నేను, హర్ష క్యారెక్టర్స్‌ వేస్తున్నామని అందరికి చెప్పేవాడిని, వాళ్ళని కూడా అలాగే చెప్పమని వాడ్ని” అని అన్నాడు. ఎందుకు అని అలీ అడగగా మన కలర్ కి మనం హీరో అంటే ఎవరూ నమ్మరు, నమ్మినా నెగిటివ్ గా చూస్తారు అందుకే అలా చెప్పాను అని అన్నారు. ఇక సందీప్ రాజ్.. కలర్‌ ఫొటోకు చాందినిని హీరోయిన్‌గా తీసుకుంటాను అన్నప్పుడు చాలామంది వద్దన్నారు. ఆ అమ్మాయి అంతకుముందు చేసిన సినిమాలు చూశావు కదా అని అనే వాళ్ళు. ఇక సుహాస్ హీరో అంటే సుహాస్ హీరోనా అని అనే వాళ్ళు. ఒక నిర్మాత అయితే రాహుల్‌ రామకృష్ణతో చేయొచ్చు కదా, నేను బడ్జెట్‌ పెడతాను అన్నాడు. కొందరు అయితే సుహాస్‌ ఎందుకు అని అడిగినా పర్వాలేదు, కానీ సుహాస్ అవసరమా అని చీప్‌ లుక్‌ ఇచ్చారు అని తెలిపాడు.

Tharun Bhaskar : టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు.. టాలీవుడ్ సమస్యలపై 10 టీవీతో మాట్లాడిన తరుణ్ భాస్కర్

అలాగే వాళ్ళ కాలేజీ విషయాలు షేర్ చేసుకున్నారు. కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వాళ్ళు అని చూసే వాళ్ళు, వాళ్ళకి ఇదే సమాధానం అని తెలిపారు. అలాగే కెరీర్ మొదట్లో ఒక స్క్రిప్ట్ మొత్తం రాపించుకొని, అవసరం ఉంది అని డబ్బులు అడిగితే కాంటాక్ట్ లేకుండా పోయాడని, ఇలా చాలా మంది మోసం చేశారని సందీప్ రాజ్ అన్నారు.