Sukumar : చిన్నప్పుడు రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి ఫేమస్ అయ్యాను..

శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. ''నా జీవితంలో సినిమాకి సంబంధించి రాజశేఖర్ గారితో నిజమైన అనుబంధం ఉంది. ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆహుతి, ఆగ్రహం,తలంబ్రాలు.............

Sukumar : చిన్నప్పుడు రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి ఫేమస్ అయ్యాను..

Sukumar :  రాజశేఖర్ హీరోగా, శివాని ముఖ్యపాత్రలో తెరకెక్కిన సినిమా శేఖర్. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘జోసెఫ్’కి ఇది రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాని జీవితా రాజశేఖర్ తెరకెక్కించారు. శేఖర్ సినిమా మే 20న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి శేఖర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ సుకుమార్ విచ్చేశారు.

 

శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. ”నా జీవితంలో సినిమాకి సంబంధించి రాజశేఖర్ గారితో నిజమైన అనుబంధం ఉంది. ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆహుతి, ఆగ్రహం,తలంబ్రాలు, మగాడు, అంకుశం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చూసి నేను ఆయనకి వీరాభిమాని అయ్యాను. చిన్నప్పుడే నేను మొట్ట మొదటిసారి రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి మాట్లాడేవాన్ని. దాంతో మా ఊర్లో నేను చాలా ఫేమస్ అయ్యాను. నన్ను స్కూల్ లో కూడా అలాగే మాట్లాడమని వాళ్ళు.”

Bhool Bhulaiyaa 2: పాపం బాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. రిజల్ట్ ఎలా ఉంటుందో?

 

”నేను కూడా సినిమాల్లోకి రాగలను, ఏమైనా చేయగలను అనే ఆలోచన రావడానికి మీరే కారణం. ఇలా చెప్పే సందర్భం ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. ఇలా నాకు సినిమాకు సంబంధించిన లైఫ్ ను అద్భుతంగా మార్చినందుకు రాజశేఖర్ గారికి చాలా థాంక్స్. సాధారణంగా సినిమా వాళ్లలో చాలా వరకు మన ఫ్యామిలీని ఇండస్ట్రీకి దూరం పెడతాం, కానీ రాజశేఖర్ గారు తన ఇద్దరి ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీకి తీసుకు రావడం చాలా గ్రేట్. జీవిత గారు చాలా హార్డ్ వర్కర్, తను ఫ్యామిలీని చూసుకుంటూ సినిమాకి దర్శకత్వం చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ సినిమా జీవిత గారి కోసం సక్సెస్ కావాలి. రామజోగయ్య శాస్తి గారు అద్భుతమైన పాటలు రాశారు. అనూప్ గారు ఇప్పటికే చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఈ నెల 20న వస్తున్న శేఖర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.