Malli Modalaindi : వర్షిణితో సుమంత్ విడాకులు!

సుమంత్ కెరీర్‌లో మరో మంచి సినిమా ‘మళ్ళీ మొదలైంది’..

Malli Modalaindi : వర్షిణితో సుమంత్ విడాకులు!

Sumanth

Updated On : January 23, 2022 / 1:30 PM IST

Malli Modalaindi: ‘సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో!’.. అంటూ సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే నెట్టింట్లో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డ్ నిజ జీవితానికి సంబంధించింది కాదని, సుమంత్ నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిందని ఆ తర్వాత బయటపడింది.

Pragathi Dance : వయసుతో పనిలేదు.. ఊపొస్తే ఊపాల్సిందే..

సుమంత్, నైనా గంగూలీ, యాంకర్ వర్షిణి సౌందర రాజన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మళ్ళీ మొదలైంది’.. కీర్తి కుమార్ దర్శకుడు. పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. భార్యతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి ప్రయత్నాలు చేసే క్యారెక్టర్‌లో కనిపించాడు సుమంత్. తన విడాకుల కేసు వాదించిన లాయర్‌నే లవ్ చెయ్యడం హైలెట్ అసలు. విజువల్స్, ఆర్ఆర్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘మళ్ళీ మొదలైంది’ సుమంత్ కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుందనిపిస్తోంది.