ఆహా లో ‘సూపర్ ఓవర్’.. ట్రైలర్ అదిరింది..

10TV Telugu News

Super Over Trailer: నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటించగా ప్రవీణ్ వర్మ దర్శకత్వంలో సుధీర్ వర్మ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ‘సూపర్ ఓవర్’ ..మంగళవారం ఈ మూవీ ట్రైలర్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య రిలీజ్ చేశారు.

ట్రైలర్‌ని బట్టి క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. బెట్టింగ్‌లు నిర్విహించే బుకీల లగ్జరీ లైఫ్‌తో పాటు బెట్టింగ్‌లు వేసే యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనేది సినిమాలో చూపించనున్నారు.

https://10tv.in/super-over-sneak-peek/

నటీనటుల పర్ఫామెన్స్, విజువల్స్, ఆర్ఆర్ బాగా కుదిరాయి.. ప్రభు, వైవా హర్ష, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటించిన ఈ ‘సూపర్ ఓవర్’ మూవీకి సంగీతం : సన్నీ ఎం.ఆర్, కెమెరా : దివాకర్ మణి, ఎడిటింగ్ : ఎస్ ఆర్ శేఖర్. జనవరి 22 నుంచి ‘ఆహా’ లో ‘సూపర్ ఓవర్’ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి.

×