Annaatthe : దటీజ్ తలైవా.. 35 రోజుల షెడ్యూల్‌తో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి..

కట్ చేస్తే ఎట్టకేలకు తలైవా ‘అన్నాత్తే’ మూవీకి సంబంధించి తన పోర్షన్ షూట్ కంప్లీట్ చేశారు. అనారోగ్యం నుండి కోలుకున్న రజినీ, హైదరాబాద్‌లో ఏకధాటిగా 35 రోజలపాటు జరిగిన షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకుని చెన్నై వెళ్లిపోయారు..

Annaatthe : దటీజ్ తలైవా.. 35 రోజుల షెడ్యూల్‌తో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి..

Annaatthe

Annaatthe: సూపర్‌స్టార్ రజినీకాంత్ గతకొద్ది కాలంగా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తూ వచ్చారు. పొలిటికల్ ఎంట్రీతో ఫ్యాన్స్‌లో జోష్ నింపడం, అంతలోనే రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం.. వీటి మధ్యలో లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’ షూటింగ్‌ కోసం ఎన్నో ఇబ్బందులు నడుమ అనారోగ్యం పాలవడం.. కరోనా కారణంగా షూటింగ్ పోస్ట్‌పోన్ అవడం.. ఇలాంటి ఊహించని సంఘటనలతో అసలు సినిమా పూర్తవుతుందా.. ఎప్పుడు విడుదలవుతోంది.. అనే సందేహాలు నెలకొన్నాయి..

Annaatthe

కట్ చేస్తే ఎట్టకేలకు తలైవా ‘అన్నాత్తే’ మూవీకి సంబంధించి తన పోర్షన్ షూట్ కంప్లీట్ చేశారు. అనారోగ్యం నుండి కోలుకున్న రజినీ, హైదరాబాద్‌లో ఏకధాటిగా 35 రోజలపాటు జరిగిన షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకుని చెన్నై వెళ్లిపోయారు..

శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ ను దీపావళి కానుకగా 2021 నవంబర్ 4 న రిలీజ్ చేయనున్నట్లు ఇంతకుముందు ప్రకటించారు. ఇప్పుడు దీపావళి నాటికి పరిస్థితులు అదుపులోకి వస్తే విడుదల చేస్తామని తెలిపారు. ఖుష్బు, కీర్తి సురేష్ కీలకపాత్రలో నటిస్తున్న ‘అన్నాత్తే’ చిత్రానికి డి.ఇమాన్ సంగీతమందిస్తున్నారు.

Annaatthe