Tamil Hero’s: టాలీవుడ్ పై కన్నేసిన తమిళ తంబీలు.. స్ట్రైట్ సినిమాలపై ఆసక్తి!

మన తెలుగు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాపై మోజుపెంచుకుంటుంటే.. తమిళ్ హీరోలు మన తెలుగు భాషా సినిమాలపై కన్నేస్తున్నారు. రజని, కమల్, సూర్య ఇలా వరసగా కొందరు హీరోలు మన దగ్గర భారీ మార్కెట్ సొంతం చేసుకుంటే..

Tamil Hero’s: టాలీవుడ్ పై కన్నేసిన తమిళ తంబీలు.. స్ట్రైట్ సినిమాలపై ఆసక్తి!

Tamil Heros ​​looking For Tollywood Interested In Straight Movies

Updated On : June 7, 2021 / 12:43 PM IST

Tamil Hero’s: మన తెలుగు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాపై మోజుపెంచుకుంటుంటే.. తమిళ్ హీరోలు మన తెలుగు భాషా సినిమాలపై కన్నేస్తున్నారు. రజని, కమల్, సూర్య ఇలా వరసగా కొందరు హీరోలు మన దగ్గర భారీ మార్కెట్ సొంతం చేసుకుంటే తమిళంలో భారీ క్రేజ్ కలిగిన విజయ్, అజిత్ లాంటి హీరోలకు మన దగ్గర అంతంతమాత్రంగానే మార్కెట్ ఉంటుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే విజయ్ దళపతి వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇప్పుడు విజయ్ బాటలోనే మరో స్టార్ హీరో ధనుష్ కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ఇప్పటికే తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటిన ధనుష్ రఘువరన్ బీటెక్ లాంటి డబ్బింగ్ సినిమాలతో దగ్గరయ్యాడు. కానీ.. మామ రజనీ రేంజ్ మార్కెట్ మాత్రం తెలుగులో పొందలేకపోతున్నాడు.

అందుకే, ధనుష్ ఈసారి స్ట్రైట్ తెలుగు సినిమాతో వచ్చేందుకు సిద్దమయ్యాడట. మొత్తం మూడు భాషలలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో మరో తెలుగు స్టార్ కూడా నటించనున్నాడని చెప్తున్నారు. ఇక మరో వెర్సిటైల్ హీరోగా పేరున్న విజయ్ సేతుపతి ఇప్పటికే తెలుగు సినిమాలలో మంచి క్రేజీ దక్కించుకున్నాడు. కానీ హీరోగా మాత్రం తెలుగులో ఇప్పటి వరకు సినిమా లేదు. అందుకే ఈసారి సేతుపతి కూడా స్ట్రైట్ తెలుగు సినిమాతో రానున్నాడట. ఇందుకోసం ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారితో చర్చలు జరుగుతున్నట్లు వినిపిస్తుంది. మొత్తం మీద తమిళ హీరోలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటే పనిలో పడ్డట్లే కనిపిస్తుంది