Tamilnadu: అలా జరిగితే రాజీనామా చేస్తానని, అంతలోనే మాట మార్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధిష్ఠాన పరిశీలకుడిగా ఉన్న ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాను కలుసుకుని సమగ్రంగా వివరించినట్లు పేర్కొన్నారు. ఇక తమిళనాడులో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అధికారాన్ని చేపట్టగలిగే స్థాయికి పటిష్ఠం చేయాలన్నదే తన ఆశయమని అన్నామలై అన్నారు

Tamilnadu: అలా జరిగితే రాజీనామా చేస్తానని, అంతలోనే మాట మార్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Tamilnadu BJP chief U-turn on resign comments

Tamilnadu: తమిళనాడులో కూటమిగా ఉన్న అన్నాడీఎంకే, భారతీయ జతా పార్టీల మధ్య కొంత కాలంగా కోల్డ్ వారు జరుగుతోంది. బీజేపీ నేతల్ని ఒక్కొక్కరుగా అన్నాడీఎంకే తమవైపుకు లాక్కుంటుండడం పట్ల బీజేపీ గుర్రుగా ఉంది. అయితే ఇది కేవలం పార్టీ రాష్ట్ర విభాగం వరకే. అధిష్టానం వీటిని పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి పార్టీ రాష్ట్ర విభాగం చేసే సూచనల్ని కూడా అధిష్టానం లెక్కలోకి తీసుకోవడం లేనట్లే కనిపిస్తోంది. దానికి ఒక మంచి ఉదహారణ తమిళనాడు బీజేపీ చీఫ్ యూటర్న్.

Karnataka Polls: చాముండేశ్వరి కాదు, కోలార్ కాదు.. కొడుకు స్థానం నుంచి పోటీకి సిద్ధమైన మాజీ సీఎం సిద్ధూ

లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుంటే తన పదవికి రాజీనామా చేస్తానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. అయితే దీనిపై ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. అబ్బబ్బే.. తమ మధ్య బేధాభిప్రాయాలు ఏమీ లేవని, అన్నాడీఎంకేతో తమ పార్టీ కూటమి పదిలమని తాజాగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లిన ఆయన శుక్రవారం ఉదయం మదురై చేరుకున్నారు. విమాపం దిగిన అనంతరమే మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలో బీజేపీ జాతీయ నాయకులు పలువురిని కలుసుకుని పార్టీ పరిస్థితులు వివరించానని తెలిపారు.

AIADMK: శశికళ, పళనిస్వామి, పన్నీర్ సెల్వం తిరిగి కలిసి పోతున్నారా? అన్నాడీఎంకేపై శశికళ హాట్ కామెంట్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధిష్ఠాన పరిశీలకుడిగా ఉన్న ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాను కలుసుకుని సమగ్రంగా వివరించినట్లు పేర్కొన్నారు. ఇక తమిళనాడులో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అధికారాన్ని చేపట్టగలిగే స్థాయికి పటిష్ఠం చేయాలన్నదే తన ఆశయమని అన్నామలై అన్నారు. పార్టీలోని సీనియర్‌ నాయకులకు తనకు మధ్య ఎలాంటి వ్యక్తిగత మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు.