Amit Shah : టార్గెట్ టీఆర్ఎస్.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే బీజేపీని సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా వ్యూహ రచన..

Amit Shah : టార్గెట్ టీఆర్ఎస్.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్న అమిత్ షా

Amit Shah

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే బీజేపీని సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు అమిత్ షా.

కేసీఆర్ పై యుద్ధం చేయాలని, టీఆర్ఎస్ తో అమీతుమీకి సిద్ధం కావాలని షా పిలుపునిచ్చారు. బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలని, కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!

హుజూరాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ విజయభేరి మోగించాలని అమిత్ షా చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి… ప్రభుత్వ పరంగా ఏం చేయాలో మాకు వదిలేయండి అని నేతలకు సూచించారు. కేంద్రం మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇకపై తెలంగాణలో తరచుగా పర్యటిస్తానని పార్టీ వర్గాలకు హామీ ఇచ్చారు అమిత్ షా.

బీజేపీపై టీఆర్ఎస్ చేసే ఆరోపణలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని పార్టీ నేతలకు అమిత్ షా సూచించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో నిత్యం ప్రచారం చేయాలన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్రను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదే తరహాలో ఇతర కార్యక్రమాలను చేపట్టాలని అమిత్ షా సూచించారు.

అమిత్ షా త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. రెండు రోజులు ఇక్కడే ఉండనున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాక అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో బీజేపీ భారీ బహిరంగ సభ ఉంటుందని సమాచారం.

Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు

”దుబ్బాక, హుజురాబాద్ లాంటి ఫలితాలే భవిష్యత్తులో తెలంగాణలో రావాలి. ఆ దిశగా కార్యచరణ రూపొందించుకుని ముందుకెళ్లండి. టీఆర్ఎస్ పై ముప్పేట దాడి చేయాలి. తెలంగాణలో తదుపరి ఏ ఎన్నిక వచ్చినా, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించేలా పకడ్బందీ ప్రణాళిక, వ్యూహంతో ముందుకెళ్లాలి. పార్టీలోకి రావాలనుకుంటున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియజేయాలి” అని తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు అమిత్ షా.