Tata Sky : టాటా ప్లేగా మారిన టాటా స్కై.. కాంబో ప్లాన్‌తో చానెల్స్, 13 ఓటీటీలు చూసే అవకాశం

ప్రస్తుతం.. టాటా ప్లేకి 2 కోట్ల 30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా.. 4 లక్షల పట్టణాల్లో కోటీ 90 లక్షల యాక్టివ్ సబ్‌స్క్రైబర్లున్నారు. 14 భాషల్లో.. 24 గంటల పాటు కస్టమర్...

Tata Sky : టాటా ప్లేగా మారిన టాటా స్కై.. కాంబో ప్లాన్‌తో చానెల్స్, 13 ఓటీటీలు చూసే అవకాశం

Tata Sky

Tata Sky Renamed Tata Play : దేశంలోనే లార్జెస్ట్ డీటీహెచ్ ఆపరేటర్‌గా పేరున్న టాటా స్కై.. నేమ్ మార్చుకుంది. ఇకపై.. టాటా ప్లేగా.. ఇండియన్ డీటీహెచ్ మార్కెట్‌లో సరికొత్త గేమ్ చూపించబోతోంది. సర్వీసుల్లోనూ భారీ మార్పులు తీసుకొచ్చింది. మొత్తం.. టాటా స్కై ఇంటర్‌ఫేస్‌ అంతా ఇక నుంచి టాటా ప్లేగా కనిపించనుంది. టీవీ చానెల్స్‌తో పాటు ఓటీటీ సర్వీసులను కూడా అందించనుంది టాటా ప్లే. ఇందుకోసం.. ఫేమస్ ఓటీటీ ప్లాట్ ఫామ్.. నెట్ ఫ్లిక్స్‌తోనూ.. చేతులు కలిపింది. టాటా ప్లే మరో రెండు బెస్ట్ డెసిషన్స్ తీసుకుంది. ఇక నుంచి రీ-కనెక్షన్ ఛార్జీలు కూడా ఉండవు.

Read More : AP PRC : ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నేటి నుంచే సమ్మె- ఉద్యోగ సంఘాల వార్నింగ్

మీరు.. రీఛార్జ్ చేయకపోయినా.. కొన్నాళ్ల పాటు టాటా ప్లే వాడకపోయినా మళ్లీ రీచార్జ్ చేసుకొని టాటా ప్లే సర్వీసులను వాడుకోవచ్చు. అలాగే.. సర్వీస్ విజిట్ ఛార్జీలను కూడా ఎత్తేసినట్లు తెలిపారు టాటా ప్లే ఎండీ అండ్ సీఈవో హరిత్ నాగ్‌పాల్. ఫ్యూచర్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని.. టాటా ప్లే కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించడానికే.. ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. టాటా ప్లే.. టాటా సన్స్, వాల్ట్ డిస్నీ కంపెనీ నుంచి వచ్చిన జాయింట్ వెంచర్. డీటీహెచ్ కేటగిరీలో టాటా ప్లే మార్కెట్ లీడర్‌. విశ్వసనీయతకు మారుపేరైన టాటా బ్రాండ్‌కు తగ్గట్లుగానే సర్వీసుల క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా కస్టమర్లను ఆకట్టుకొంటోంది.

Read More : Electric Double-Decker Buses: ముంబైలో రూ.3వేల 600 కోట్లతో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

ప్రస్తుతం.. టాటా ప్లేకి 2 కోట్ల 30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా.. 4 లక్షల పట్టణాల్లో కోటీ 90 లక్షల యాక్టివ్ సబ్‌స్క్రైబర్లున్నారు. 14 భాషల్లో.. 24 గంటల పాటు కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. టాటా ప్లేలో ప్రస్తుతం 652 చానెల్స్ స్ట్రీమ్ అవుతున్నాయి. ఇందులో 498 ఎస్డీ, 91 హెచ్‌డీ చానెల్స్ ఉన్నాయి. డీటీహెచ్ కంపెనీగా మొదలైన టాటా స్కై.. ఇప్పుడు టాటా ప్లేగా మారి కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఎదిగిందని.. టాటా ప్లే ఎండీ అండ్ సీఈవో హరిత్ నాగ్‌పాల్ తెలిపారు.