Teacher recruitment scam: ఇప్పుడు అర్పితా ముఖర్జీ ఆఫీసులపై ఈడీ దృష్టి
పార్థ ఛటర్జీకి పరిచయం అయినప్పటి నుంచి ఈ మూడు సంస్థలకు అర్పితా ముఖర్జీ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అర్పితా ముఖర్జీ ఫ్లాటులో నిన్న ఉదయమే అధికారులు రూ.27.9 కోట్లు, ఆరు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కూడా సోదాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీని విచారిస్తోన్న అధికారులు వారి నుంచి కీలక విషయాలు రాబడుతూ సోదాలు జరుపుతున్నారు.

Arpitha
Teacher recruitment scam: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో తాజా మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇళ్ళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆమె ఇళ్ళలో దొరికిన నగదు రూ.49.8 కోట్లకు చేరింది. ఈ సోదాలు ఇక్కడితో ఆగబోవని స్పష్టమవుతోంది. ప్రస్తుతం అర్పితా ముఖర్జీకి సంబంధించిన మూడు సంస్థల నగదు చలామణీ గురించి ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
పార్థ ఛటర్జీకి పరిచయం అయినప్పటి నుంచి ఈ మూడు సంస్థలకు అర్పితా ముఖర్జీ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అర్పితా ముఖర్జీ ఫ్లాటులో నిన్న ఉదయమే అధికారులు రూ.27.9 కోట్లు, ఆరు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కూడా సోదాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీని విచారిస్తోన్న అధికారులు వారి నుంచి కీలక విషయాలు రాబడుతూ సోదాలు జరుపుతున్నారు.
కాగా, తనను ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని పార్థ ఛటర్జీ అంటున్నారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తాము దక్షిణ కోల్‌కతాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగనున్నట్లు బీజేపీ తెలిపింది.
Sonia Gandhi: శిక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా.. సోనియాను లాగడమెందుకు?