Telangana Theatres : థియేటర్లలో పార్కింగ్ ఫీజ్ వసూలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలోని సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది..

Telangana Theatres : థియేటర్లలో పార్కింగ్ ఫీజ్ వసూలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Telangana Theatres

Telangana Theatres: తెలంగాణలోని సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. అటు మల్టీప్లెక్స్‌, మాల్స్‌లో పార్కింగ్‌ ఫీజు లేదని తెలిపింది.

కరోనా కారణంగా ఇన్నాళ్లూ థియేటర్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కరెంట్ ఫీజులతో పాటు కొన్ని విషయాల్లో తమకు వెసులుబాటు కల్పించాలని థియేటర్ల యాజమాన్యం అధ్యక్షులు ప్రభుత్వాన్ని కోరారు. అందులో భాగంగానే మల్టీప్లెక్సులు, మాల్స్‌ మినహా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చంటూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణలో ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్ల ఓపెన్ కానున్నాయి. అది కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో ప్రారంభం అయ్యేలా అనుమతినిచ్చింది ప్రభుత్వం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో థియేటర్లు ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ ప్రకటించింది.

జూలై 23 నుంచి సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్సుల్లో సినిమాలేను ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభం కానుండడంతో ఆడియెన్స్, మూవీ లవర్స్, టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.