Dr Tamilisai Soundararajan : గతంలో పాములు, చేపలు కనిపించేవి.. కేసీఆర్ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు
Hussain Sagar : హుస్సేన్ సాగర్ తెలంగాణకే ఒక బహుమానం. ప్రకృతి ఇచ్చిన వరం. అలాంటి హుస్సేన్ సాగర్ ఇప్పుడు..

Dr Tamilisai Soundararajan
Dr Tamilisai Soundararajan – Hussain Sagar : తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి పరోక్ష విమర్శలు చేశారు. హుస్సేన్ సాగర్ పరిశుభ్రతపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సెయిలింగ్ వీక్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆమె హుస్సేన్ సాగర్ తెలంగాణకు ఓ గిఫ్ట్ అన్నారు. సాగర్ ను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గతంలో హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్ చేస్తుంటే పాములు, చేపలు కనిపించేవని అధికారులు చెప్పారని, కానీ కాలుష్యం వలన ఇప్పుడు అలాంటివి కనిపించడం లేదంటున్నారని తెలిపారు. హుస్సేన్ సాగర్ ను ప్రభుత్వం శుభ్రపరచాలని సూచించారు. సాగర్ ను పరిశుభ్రంగా ఉంచాల్సిన విషయంలో ప్రభుత్వంతో పాటు ప్రజలపైనా బాధ్యత ఉందన్నారు గవర్నర్ తమిళిసై.
” నేను ప్రతి ఏటా సెయిలింగ్ వీక్ విన్నర్స్ కి బహుమతి ప్రదానోత్సవానికి వస్తున్నా. 37వ సెయిలింగ్ విజేతలకు నా అభినందనలు. ఒక విన్నపం ఏంటి అంటే హుస్సేన్ సాగర్ అనేది తెలంగాణకే ఒక బహుమానం. ప్రకృతి ఇచ్చిన వరం. అలాంటి హుస్సేన్ సాగర్ ఇప్పుడు చెత్తా చెదారంతో నిండిపోయింది. కంపు కొడుతోంది. హుస్సేన్ సాగర్ ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదీ ఒక మదర్ లేక్ కూడా. ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను ఈ సాగర్ లేక్ మనకు ఇచ్చింది. కాబట్టి ఇలాంటి హుస్సేన్ సాగర్ ని క్లీన్ గా ఉంచడం ప్రభుత్వం బాధ్యత. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు ఆర్మీ మాత్రమే కాదు ఇది ప్రజలు కూడా తమ బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అంతర్జాతీయ వేదికలకు సిద్ధమవుతున్న సెయిలర్స్ కు కూడా వేదిక అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయాలి” అని గవర్నర్ తమిళిసై అన్నారు.
Also Read..YS Sharmila: మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్లు.. కేసీఆర్ అవినీతి చిట్టా అంతా..: షర్మిల