Telangana Corona : తెలంగాణలో కొత్తగా 36 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20వేల 379 కరోనా పరీక్షలు నిర్వహించగా, 36 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.(Telangana Corona)

Telangana Corona : తెలంగాణలో కొత్తగా 36 కరోనా కేసులు

Telangana Covid Report

Updated On : March 25, 2022 / 10:34 PM IST

Telangana Corona : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 20వేల 379 కరోనా పరీక్షలు నిర్వహించగా, 36 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో మరో 80 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,074 మంది కరోనా బారినపడగా… 7,86,388 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 575 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ తో ఇప్పటివరకు 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 20వేల 444 కరోనా పరీక్షలు చేయగా 49మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona)

Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉంది. కొన్ని జులుగా రెండు వేలకు దిగువన కొత్త కేసులు, 100 లోపు మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 6.9 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,685 మందికి పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.24 శాతానికి క్షీణించింది.

నిన్న 2,499 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా తగ్గిపోతున్నాయి. యాక్టివ్ కేసులు 21,530కి తగ్గి, 0.05 శాతానికి చేరకున్నాయి. ఇప్పటివరకూ 4.30 కోట్ల కరోనా కేసులు రాగా.. 4.24 కోట్ల మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో మరో 83 మంది కోవిడ్ తో మృతి చెందారు. దేశంలో నేటివరకు కరోనాతో 5.16 లక్షలు మంది మరణించారు. గతేడాది జనవరి నుంచి 182 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 29.8 లక్షల మంది టీకా వేయించుకున్నారు.(Telangana Corona)

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.

India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేత

దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.