Telangana Sona Benefits : తెలంగాణ సోనా.. డయాబెటిస్ బాధితులకు దివ్యౌషధం..!

Telangana Sona Benefits : ఈరోజుల్లో షుగర్ సమస్య అనేది వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ వచ్చేస్తోంది. చిన్న వయస్సు నుంచి వృద్ధుల వరకు ఈ షుగర్ సమస్యతోనే బాధపడుతున్నారు.

Telangana Sona Benefits : తెలంగాణ సోనా.. డయాబెటిస్ బాధితులకు దివ్యౌషధం..!

Telangana Sona Benefits Telangana Sona Good For Diabetic Patients, This Can Control Your Sugar Levels

Telangana Sona Benefits : ఈరోజుల్లో షుగర్ సమస్య అనేది వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ వచ్చేస్తోంది. చిన్న వయస్సు నుంచి వృద్ధుల వరకు ఈ షుగర్ సమస్యతోనే బాధపడుతున్నారు. అసలు షుగర్ సమస్య పెరగడానికి ప్రధాన కారణం.. రైస్ ఎక్కువగా తీసుకోవడమే.. ఎందుకంటే రైసులో అత్యధిక స్థాయిలో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువ మొత్తంలో విడుదలై తొందరగా ఖర్చు అయిపోతాయి. తద్వారా చాలామందిలో షుగర్ సమస్య
తగ్గకపోవడానికి రైస్ అధికంగా తీసుకోవడమేనని అంటారు.

ఏది ఏమైనా.. ఏ బియ్యంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంచుకోగలమంటే.. అందులో తెలంగాణ సోనా బియ్యం.. షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో దీనికి సాటిలేదుంటున్నారు నిపుణులు. ఒక్క మాటలో చెప్పాలంటే.. డయాబెటిస్ పేషెంట్లకు దివ్యౌషధమే.. తెలంగాణ సోనా తీసుకునే వారి శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతాయి ఈ బియ్యం.. తెలంగాణ సోనాలో తక్కువ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌(GI) కలిగి ఉంటాయి. అందుకే ఈ బియ్యాన్ని వండుకుని తింటే షుగర్ సమస్య తలెత్తదు.

ఇదివరకే షుగర్ సమస్యతో బాధపడేవారు కూడా ఎలాంటి ఇబ్బంది భయం లేకుండా ఈ బియ్యాన్ని వండుకుని తినవచ్చునని అంటున్నారు. ఈ బియ్యం షుగర్ కంట్రోల్ చేయడంలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో శాస్త్రీయంగా రుజువైంది కూడా. తెలంగాణ సోనా(RNR 15048)కు సంబంధించి అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.

మనం తీసుకునే ఆహారం శరీరంలోకి ఎంత గ్లూకోజ్‌ను విడుదల చేస్తుందో లెక్కించడాన్ని గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ అంటే.. శరీరంలో విడుదలయ్యే గ్లూకోజ్‌ ఎంత స్థాయిలో ఉందో లెక్కించవచ్చు. ఆహారం తీసుకున్నాక డయాబెటిస్ బాధితులకు 1-55 శాతం ఉండొచ్చు. 56-69 శాతం మీడియా జీగా పిలుస్తారు. అలాగే 70శాతానికి పైగా ఉంటే హైజీఐగా పిలుస్తారు.

Telangana Sona Benefits Telangana Sona Good For Diabetic Patients, This Can Control Your Sugar Levels (1)

Telangana Sona Benefits Telangana Sona Good For Diabetic Patients, This Can Control Your Sugar Levels 

వ్యవసాయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈ తెలంగాణ సోనాను ఆవిష్కరించారు. తక్కువ GI కలిగిన ఈ బియ్యాన్ని అందుబాటులో తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఈ తెలంగాణ సోనా పేరుతో తీసుకొచ్చిన కంపెనీ డెక్కన్‌ ముద్రను ఆయన అభినందించారు.

సాధారణంగా షుగర్‌ బాధితులు రైస్ తగ్గించి తీసుకుంటారు. అన్నం తింటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనేది దూరంగా ఉంటారు. చాలా తక్కువ మొత్తంలోనే తీసుకుంటుంటారు. అదే, తెలంగాణ సోనా బియ్యాన్ని తింటే షుగర సమస్యలేమి ఉండవంటోంది అధ్యయనం. ఈ బియ్యంలో తక్కువ జీఐ ఉండటమే అందుకు కారణమట.. సాధారణ రకం బియ్యంలో GI 73శాతం వరకు ఉంటుంది. అదే. తెలంగాణ సోనాలో మాత్రం 51 శాతమే ఉంటుందట..

ఇక గోధుమల్లో 62 శాతం ఉంటే.. బ్రౌన్‌ రైస్‌లో మాత్రం 68 శాతం, జొన్నల్లో 70 శాతం GI ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది డయాబెటిస్ బాధితులు బియ్యాన్ని వండుకుని తినడం మానేశారు. దానికి బదులుగా కొర్రలు, రాగులు, తైదలు వంటి చిరుధాన్యాలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఈ తృణధాన్యాల్లో GI 50-52 శాతం మధ్య ఉంటుందని తేలింది.

తెలంగాణ సోనాలోనూ జీఐ ఇలానే ఉండటంతో అందరూ ఈ బియ్యమే తింటే మంచిందని సూచిస్తున్నారు నిపుణులు. ఇప్పటివరకూ డయాబెటిస్ రాని వాళ్లు ముందునుంచే ఈ బియ్యాన్ని తినడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో షుగర్ రాకుండా నివారించుకోవచ్చునని అంటున్నారు. ఈ తెలంగాణ సోనా రైస్ డెక్కన్ ముద్ర సంస్థ మార్కెట్లోకి వచ్చింది.

Read Also : Diabetes : షుగర్ వ్యాధి ఉంటే…ఆహారం విషయంలో!…