Diabetes : షుగర్ వ్యాధి ఉంటే…ఆహారం విషయంలో!…

చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్లు తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్‌లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Diabetes : షుగర్ వ్యాధి ఉంటే…ఆహారం విషయంలో!…

Sugar

Diabetes : మధుమేహంలో బాధపడుతున్న తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. జీవన విధానం, తినే ఆహారం ఈ రెండు షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ముఖ్యమైనవి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకునేందుకు ఏ ఆహారాన్ని తీసుకోవాలో, ఏ ఆహారం తీసుకోకూడదో తెలుసుకోవటం మంచిది. షుగరు వ్యాధి ఉన్నవాళ్లు తీపి మానెయ్యడం కాదు, పసుపు, మెంతులు, నేరేడు, వాము, మెంతికూర, దొండకాయ, కాకరకాయ, ములక్కాడ, దోసకాయ , చిక్కుడు వంటివి తినాలి. సమయం తప్పకుండా రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకోవాలి. అన్నం కన్నాకూరలు ఎక్కువ తినడం మంచిది. ఉపవాసాలు చేయటం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు.

మధ్యాహ్న భోజనం సమయంలో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతికూర, బతువా, బ్రోకలీ, గోరింటాకు, తోరాయి, చేదుకాయ వంటివి తినవచ్చు. వీటిలో తక్కువ కెలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చ కూరలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గోధుమ రొట్టే బదులుగా ధాన్యపు రొట్టె, మల్టీగ్రెయిన్‌ బ్రెడ్‌, బ్రౌన్‌ రైస్‌, బార్లీ తీసుకోవడం మంచిది. ఇవి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.

పెద్దవయస్సువారిలో గొంతుకలో మింగడం కష్టమవుతుంది. అలాంటివారు ఆహారాన్ని మెత్తగా చేసుకుని తినాలి. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు కొద్దిమోతాదులో ఆహారాన్ని రోజుకు 4 సార్లు తీసుకోవడం మంచిది. అన్నంతిన్నాక నీళ్ళు తాగాలి. భోజనానికి, భోజనానికి నడుమ సుగర్ లెస్ బిస్కెట్లు, పాలుతీసుకోవటం మంచిది. పెరుగు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముల్లంగిదుంపలు, ఆకుకూరలు కూడా తినాలి. వారానికి కనీసం మూడుసార్లు మినపగారి తినడం మంచిది. మలబద్దకం ఉన్నవాళ్ళు అన్నంలో రసం తో కలుపుకుని తినవచ్చు. నువ్వుల నూనెతో ప్రతివారం ఒంటికి మర్దన చేసుకుని స్నానం చేయడం, రాత్రి పడుకునే ముందు అరికాళ్ళకి నువ్వుల నూనె మర్దన చేసుకోవడం వల్ల ప్రశాంతత చేకూరుతుంది.

పండ్లు ఎక్కువగా తినటం మంచిదికాదు. పండ్లలో 50% సుక్రోజ్ ,50% ఫ్రక్టోజ్ ఉంటుంది . సూక్రోజ్ మధుమేహవ్యాధిగ్రస్తులకు ఇబ్బందికరంగా మారుతుంది. నిమ్మ జాతి పండ్దలలో సూక్రోజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తినటం మంచిది. చక్కెరలు మరియు కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే దీనిని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. ఈ లక్షణాలు ఉన్నవారు సోడాలు తాగడం ఆపేయాలి. ప్యాక్ చేసిన పండ్ల రసాలకు దూరంగా ఉండటం ఉత్తమం. అరటి , జామ , సపోట , యాపిల్ , సీతాఫలం వంటి అధిక సూక్రోజ్ ఉన్న పండ్లు తినకూడదు. నీరు అధికంగా ఉన్న పుచ్చకాయను కొద్ది మోతాదులో తీసుకోవాలి.

శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ప్రత్యేకించి ప్యాక్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్లు తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్‌లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తిన్న ఆహారములో కేలరీలు తక్కువగా ఉండాలి. తక్కువ తక్కువ గా ఎక్కువసార్లు తినాలి. అలాగని కడుపునిండా తినటం ఏమాత్రం మంచిదికాదు. క్రమం తప్పకుండా వాకింగ్ 30 నిమిషాల పాటైనా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవడం ఉత్తమం.