Terrifying Drone Video: బీచ్లో ఉన్న అమ్మాయి వద్దకు దూసుకువచ్చిన భారీ షార్క్ చేప
ఆస్ట్రేలియాలోని హిల్లరీస్ డాగ్ బీచ్ లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. బీచ్ లోని ఓ చోట ఓ అమ్మాయి నీళ్లలో ఉంది. అదే సమయంలో ఆమె వైపుగా సముద్రంలో నుంచి ఓ షార్క్ చేప వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఓ డ్రోనుతో కొందరు వీడియో తీస్తున్నారు. దీంతో అందులో ఈ దృశ్యాలు చిక్కాయి.

Terrifying Drone Video
Terrifying Drone Video: బీచ్లో స్విమ్మింగ్ చేస్తున్న ఓ అమ్మాయి సమీపంలోకి ఓ భారీ షార్క్ చేప దూసుకువచ్చింది. ఆమెపై అది దాడి చేయాలని చూసినట్లు తెలుస్తోంది. చివరకు ఆ అమ్మాయికి కొన్ని అడుగుల దూరం నుంచి ఆ షార్క్ చేప వెనక్కి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని హిల్లరీస్ డాగ్ బీచ్ లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. బీచ్ లోని ఓ చోట ఓ అమ్మాయి నీళ్లలో ఉంది. అదే సమయంలో ఆమె వైపుగా సముద్రంలో నుంచి ఓ షార్క్ చేప వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఓ డ్రోనుతో కొందరు వీడియో తీస్తున్నారు. దీంతో అందులో ఈ దృశ్యాలు చిక్కాయి.
ఆ షార్క్ చేప తన మనసు మార్చుకుని వెనక్కి వెళ్లిపోకపోతే ఆ అమ్మాయి ప్రాణాలు పోయేవని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. బీచ్ ల వద్ద పర్యాటకుల రక్షణ కోసం అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని కొందరు సూచించారు. షార్కు చేపలు దాడులు చేసే ఘటనలు హాలీవుడ్ సినిమాల్లోనే చూశామని, ఇప్పుడు కూడా దాదాపు అటువంటి సీనే నిజజీవితంలోనూ చూస్తున్నామని కొందరు పేర్కొన్నారు.
View this post on Instagram
Renjarla Rajesh Comments : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ అనుచిత వ్యాఖ్యలు