Virata Parvam: వెన్నెల పుట్టుక.. సాయి పల్లవి డైలాగుకు పూర్తి న్యాయం!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎవరినోట విన్నా విరాటపర్వం సినిమా గురించే ముచ్చట. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో...

Virata Parvam: వెన్నెల పుట్టుక.. సాయి పల్లవి డైలాగుకు పూర్తి న్యాయం!

The Birth Of Vennela Scene Released From Virata Parvam

Virata Parvam: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎవరినోట విన్నా విరాటపర్వం సినిమా గురించే ముచ్చట. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటమే. ఇక రానా దగ్గుబాటి కూడా ఈసారి మరో కొత్త పాత్రతో మనముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Virata Parvam : సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. విరాటపర్వంపై ఎఫెక్ట్??

ఇప్పటికే ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లడంతో విరాటపర్వం చిత్ర యూనిట్ పూర్తిగా సక్సెస్ అయ్యింది. కాగా తాజాగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులు ఓ సర్‌ప్రైజ్‌ను అందజేసింది. ఈ సినిమా ట్రైలర్‌లో సాయి పల్లవి చెప్పిన డైలాగ్.. ‘‘ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ..’’ అనే దానికి పూర్తి న్యాయం చేస్తూ సినిమాలోని ఏకంగా 4 నిమిషాల సీన్‌ను రిలీజ్ చేసింది.

Virata Parvam: విరాటపర్వం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు!

పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను తన భర్త ట్రాక్టర్‌లో తీసుకెళ్తుండగా, అడవి మధ్యలో పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆ మహిళకు నొప్పులు ఎక్కువవడంతో, ఓ మహిళా నక్సల్‌గా నివేదా పేతురాజ్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె డాక్టర్ అని, ఆ గర్భిణికి డెలివరీ చేస్తుంది. ఇక ఆ పుట్టిన పాపకు వెన్నెల అనే పేరును పెట్టి, పోలీసుల తూటాకు ప్రాణం వదులుతుంది. ఇలా వెన్నెల పుట్టుక వెనుక ఉన్న యుద్ధం తాలూకా సీన్‌ను మనకు సినిమా రిలీజ్‌కు ముందే చూపించారు విరాటపర్వం చిత్ర యూనిట్. ఈ ఒక్క సీన్‌తో విరాటపర్వం సినిమాలో విప్లవం వెనకాల ఉన్న ప్రేమ ఏమిటనే అంశాన్ని మనకు చూపించే ప్రయత్నం చిత్ర యూనిట్ చేసిందని అర్ధమవుతోంది. మరి విరాటపర్వం సినిమాలోని ఈ వెన్నెల పుట్టుక సీన్‌ను మీరూ ఓసారి చూసేయండి.