Snake Vs Cat : పాము దాడిలో తెలివిగా తప్పించుకున్న పిల్లి… వైరల్ గా మారిన వీడియో

ఓ గోడపై పిల్లి కూర్చుని ఉంటుంది. గోడ క్రింది బాగంలో ఓ తెల్లిని పెట్టేలె నల్లని సార్లను కలిగి గోధుమ వర్ణంలో ఉన్న పాము పిల్లివైపు తదేకంగా చూస్తుంటుంది.

Snake Vs Cat : పాము దాడిలో తెలివిగా తప్పించుకున్న పిల్లి… వైరల్ గా మారిన వీడియో

Cat,snake

Snake Vs Cat : తెలితేటలు ఎక్కువగా కలిగి ఉండే జంతువులలో పిల్లి కూడా ఒకటి..ప్రమాదం పొంచి ఉందనుకుంటే అత్యంత వేగంగా తప్పించుకోవటం దానికున్న శక్తి సామర్ధ్యాలకు నిదర్శనం. ప్రస్తుతం సోషలిమీడియాలో పిల్లి, పాములకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఓ గోడపై పిల్లి కూర్చుని ఉంటుంది. గోడ క్రింది బాగంలో ఓ తెల్లిని పెట్టేలె నల్లని సార్లను కలిగి గోధుమ వర్ణంలో ఉన్న పాము పిల్లివైపు తదేకంగా చూస్తుంటుంది. పిల్లి కూడా పాము కదలికలను గమనిస్తూ గోడపై కూర్చుని చూస్తూ ఉంటుంది. కన్నురెప్ప వాల్చేపాటులో పాము ఒక్కసారిగా గోడపైన ఉన్న పిల్లిని కాటు వేసే ప్రయత్నం చేయబోతుంది. ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసి పిల్లి రెప్పపాటులో గోడపై నుండి ఎగిరి గిందకు దూకుతుంది.

ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పిల్లి ప్రదర్శించిన సమయస్పూర్తిని, తెలివి తేటలను, పాముదాడి నుండి తప్పించుకోవటాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. అయితే గతంలో చోటు చేసుకున్న అనేక ఘటనలో పిల్లి, పాముకు తీవ్ర వైరం నెలకొన్న దృశ్యాలు మనం చూసి ఉంటాం. పాములను ఎదురొడ్డి నిల్చున్న పిల్లుల కధనాలు వెలుగు చూశాయి.