Tokyo Olympics Gold Medals : ఇంట్రెస్టింగ్.. ఒలింపిక్స్‌లో ఇచ్చే గోల్డ్ మెడల్‌లో బంగారం ఎంతుంటుందో తెలుసా? మెడల్స్ దేంతో తయారు చేస్తారంటే..

ఒలింపిక్స్ లో విజేతలకు మెడల్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. టాపర్ కి గోల్డ్(స్వర్ణం), సెకండ్ విన్నర్ కి సిల్వర్(రజతం), మూడో విజేతకి బ్రాంజ్(కాంస్యం) మెడల్ ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ లో ఎంత బంగారం ఉంటుంది? అసలు ఈ మెడల్స్ దేంతో తయారు చేస్తారు? ఈ వివరాల గురించి మీకు తెలుసా? దీని వెనుక చాలా ఇంట్రస్టింగ్ విషయాలున్నాయి.

Tokyo Olympics Gold Medals : ఇంట్రెస్టింగ్.. ఒలింపిక్స్‌లో ఇచ్చే గోల్డ్ మెడల్‌లో బంగారం ఎంతుంటుందో తెలుసా? మెడల్స్ దేంతో తయారు చేస్తారంటే..

Tokyo Olympics Gold Medals

Tokyo Olympics Gold Medals : ఒలింపిక్స్ లో విజేతలకు మెడల్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. టాపర్ కి గోల్డ్(స్వర్ణం), సెకండ్ విన్నర్ కి సిల్వర్(రజతం), మూడో విజేతకి బ్రాంజ్(కాంస్యం) మెడల్ ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ లో ఎంత బంగారం ఉంటుంది? అసలు ఈ మెడల్స్ దేంతో తయారు చేస్తారు? ఈ వివరాల గురించి మీకు తెలుసా? దీని వెనుక చాలా ఇంట్రస్టింగ్ విషయాలున్నాయి.

టోక్యో ఒలింపిక్స్ లో ఇచ్చే గోల్డ్ మెడల్ లో కేవలం 1.2శాతం బంగారం మాత్రమే ఉంటుంది. మిగతాదంతా(98.8శాతం) సిల్వరే. సైన్స్ కమ్యూనికేషన్ వెబ్ సైట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ ఆసక్తికర అంశాలు వెల్లడించింది. 1.2 పౌండ్ గోల్డ్ మెడల్ లో 6.7 గ్రాముల పసిడి ఉంటుంది.

2016 రియో ఒలింపిక్స్ లో.. గోల్డ్ మెడల్ లో 6 గ్రాముల బంగారం ఉంది. గోల్డ్ మెడల్స్ లో పల్చని బంగారం లేయర్ ఉంటుంది. సిల్వర్ తో కవర్ అయి ఉంటుంది. ఒక పౌండ్ బ్రాంజ్ మెడల్స్( కాపర్, టిన్ మిళితం) లో 95శాతం కాపర్, 5శాతం జింక్ తో చేసి ఉంటాయి.

టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్.. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తయారు చేసింది. మొత్తం 5వేల మెడల్స్ చేసింది. కాగా, మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ పతకాలను దేశ ప్రజలు స్వచ్చందంగా ఇచ్చిన రీసైకిల్డ్ ఎలక్ట్రానిక్ డివైజ్ లు, సెల్ ఫోన్లతో తయారు చేశారు.

రెండేళ్ల కాలంలో టోక్యో 2020 మెడల్ ప్రాజెక్ట్ కోసం 78వేల 985 టన్నుల ఎలక్ట్రానిక్ డివైజ్ లు సేకరించారు. ఇందులో 6.21 మిలియన్ల సెల్ ఫోన్లు ఉన్నాయి. దేశం మొత్తం నుంచి వీటిని సేకరించారు. ఈ డివైజ్ లను కరిగించడానికి హీట్ చేశారు. అందులోని మెటల్ ను బయటకు తీశారు. అందులో నుంచి 32 కిలోల గోల్డ్, 3వేల 500 కిలోల సిల్వర్, 2వేల 200 కిలోల బ్రాంజ్ వచ్చింది. ఒక గ్రామ్ గోల్డ్ బయటకు తీయడానికి 40 సెల్ ఫోన్లను మెల్ట్ చేయాల్సి ఉంటుంది.

రీసైకిల్డ్ మెటల్ నుంచి మొత్తం మెడల్స్ తయారు చేయడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి. 2016 ఒలింపిక్స్ లో తయారు చేసిన మెడల్స్ లో 30శాతం సిల్వర్ మెడల్స్ కారు భాగాలు, అద్దాల(మిర్రర్) నుంచి తయారు చేశారు.